కులపోళ్లు ఉన్న చోటనే పవన్ కల్యాణ్ ఉండును!

తను కుల రాజకీయాలు చేయను అంటూ తరచూ చెప్పుకునే పవన్ కల్యాణ్ మాటల్లో, చేతల్లో అనునిత్యం కులకంపు కొడుతూ ఉంటుంది. తనకు పడని వాళ్లను విమర్శించాలంటే పవన్ కల్యాణ్ వారి కులం గురించి ఎత్తుతాడు.…

తను కుల రాజకీయాలు చేయను అంటూ తరచూ చెప్పుకునే పవన్ కల్యాణ్ మాటల్లో, చేతల్లో అనునిత్యం కులకంపు కొడుతూ ఉంటుంది. తనకు పడని వాళ్లను విమర్శించాలంటే పవన్ కల్యాణ్ వారి కులం గురించి ఎత్తుతాడు.

ఆఖరికి మతచిచ్చు పెట్టడానికి కూడా పవన్ కల్యాణ్ ఓపెన్ గానే ప్రయత్నిస్తూ ఉన్నాడు. రెండో పెళ్లి, మూడో పెళ్లి చేసుకోవడంలో పవన్ కల్యాణ్ కులం, మతంను పట్టించుకోలేదేమో కానీ రాజకీయంలో మాత్రం ఆయన కులకంపు పతాక స్థాయిలో ఉంది.

ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయడం, ఆయన పోటీ చేయడం.. ఇవన్నీ కుల సమీకరణాల ఆధారంగానే జరిగాయనేది ఓపెన్ సీక్రెట్. కామెడీ ఏమిటంటే, ఎన్నికలు అయిపోయాకా పవన్ కల్యాణ్ కుల రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఆయన రాజకీయ పర్యటనలు కూడా కేరాఫ్ కులపోళ్లు ఉన్న దగ్గరే సాగుతూ ఉన్నాయి.

డిసెంబర్ ఒకటి నుంచి పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటన షెడ్యూల్ ను ఒకసారి గమనిస్తే.. రాయలసీమలో  పవన్ ఓన్ చేసుకునే బలిజలు ఎక్కువగా ఉన్న  నియోజకవర్గాల మీదుగానే ఆయన పర్యటన సాగుతోంది.

కడప జిల్లా రైల్వే కోడూరు.. ఈ నియోజకవర్గంలో బలిజల జనాభా ఎక్కువ. ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు డెబ్బై శాతానికి పై స్థాయి ఓట్లను పొందింది ఈ నియోజకవర్గంలో. ఇక్కడ ప్రజా రాజ్యం పార్టీ పోటీలో ఉన్నప్పుడు ఇరవై వేల ఓట్లు పడ్డాయి, జనసేన దాదాపు తొమ్మిది వేల ఓట్లు పడ్డాయి.

సీమలో జనసేన పార్టీకి కనీసం తొమ్మిది వేల ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు కూడా చాలా చాలా తక్కువే. ఉన్నంతలో తొమ్మిదే వేల ఓట్లు వచ్చిన ఈ నియోజకవర్గం బెటర్ గా కనిపిస్తూ ఉంది. దానికి కారణం కూడా అక్కడ బలిజల జనాభా ఉండటమే. అందుకే పవన్ కల్యాణ్ సీమ పర్యటన రైల్వే కోడూరుతో మొదలు కాబోతోంది.

ఇక రెండో నియోజకవర్గం తిరుపతి. ఇది చిరంజీవి పరువు నిలిపిన నియోజకవర్గం, బలిజల జనాభా గట్టిగా ఉన్న నియోజకవర్గం. అందుకే అక్కడ నుంచి పవన్ కల్యాణ్ సమీక్ష సాగబోతోందట. ఇలాంటి కోవకే చెందిన నియోజకవర్గం మదనపల్లె. అక్కడ కూడా పవన్ కల్యాణ్ సొంతం చేసుకోవాలనుకుంటున్న బలిజల ఓట్లు గట్టిగా ఉన్నాయి.

ఏరి కోరి ఇలా తను పొందాలనుకునే కులం ఓట్లు ఎక్కువగా ఉన్న చోటే పవన్ కల్యాణ్ పర్యటన సాగబోతూ ఉంది. ఇంత కుల రాజకీయం చేస్తున్న పవన్ కల్యాణ్.. అక్కడ నుంచినే కులం గురించి బోలెడన్ని నీతులు చెబుతారు.

కులాలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడానికి కూడా ఆయన వెనుకాడకపోవచ్చు! మొత్తానికి పూర్తి విచ్చిన్నకర రాజకీయం దిశగా సాగుతున్నాడు జనసేన అధిపతి. ఇలా అతడు ఎక్కడకు చేరతాడో!