టాలీవుడ్‌లో మరో విషాదం!

టాలీవుడ్‌ను వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవ‌లే సీనియ‌ర్ న‌టి జ‌మున మృతి మ‌రచిపోక ముందే.. ఇవాళ‌ ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంగా బాధ‌ప‌డుతున్న ఆయ‌న చెన్నైలోని ఓ…

టాలీవుడ్‌ను వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవ‌లే సీనియ‌ర్ న‌టి జ‌మున మృతి మ‌రచిపోక ముందే.. ఇవాళ‌ ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంగా బాధ‌ప‌డుతున్న ఆయ‌న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరోగ్య పరిస్థితి విషమించ‌డంతో ఇవాళ‌ ఉదయం తుదిశ్వాస విడిచారు.

దర్శకుడు సాగర్ గా పిలవబడే విద్యాసాగర్ రెడ్డి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1983లో నరేష్-విజయశాంతిల 'రాకాసిలోయ'సినిమాతో దర్శకుడిగా ప‌రిచ‌యం అయ్యారు. సాగ‌ర్ దర్శకత్వం వహించిన రామసక్కనోడు చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి. సాగర్‌.. స్టువర్ట్‌పురం, అమ్మదొంగ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. గ‌తంలో తెలుగు సినిమా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

దాదాపు 30 చిత్రాలకు దర్శకత్వం వహించిన సాగ‌ర్ కు.. శ్రీను వైట్ల లాంటి చాలా మంది శిష్యులు విజయవంతమైన దర్శకులుగా పేరుతెచ్చుకున్నారు.