దర్శకుడు రాజమౌళి భారీ సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల ఫిక్స్ అయింది. అయితే ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలు వస్తున్నాయంటే మిగిలిన సినిమాలు మర్యాదగా, భయంగా దారి ఇచ్చేసేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధేశ్యామ్ లు కూడా ఆర్ఆర్ఆర్ తో పాటు విడుదల అవుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ కు టెన్షన్ మొదలైంది. అసలే ఆంధ్రలో రేట్లు లేవు. అందువల్ల కనీసం 18 శాతం అమ్మకం రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే కేవలం ఆంధ్ర, సీడెడ్ ల మీదే ఓ పాతిక కోట్లు లాస్ విడుదలకు ముందే కనిపిస్తుంది.
పైగా టఫ్ కాంపిటీషన్ లో విడుదలయితే పరిస్థితి ఏమిటి? కోర్టుకు వెళ్దాం అనుకున్నారు. అది మంచి ఐడియా కాదని అందరూ చెప్పడంతో వెనక్కు తగ్గి ఆ మేరకు వచ్చిన వార్తలను ఖండించారు. అర్జెంట్ గా స్టేట్ మెంట్ లు వదిలారు.
ఇప్పుడు ఏం చేయాలా అని రాజమౌళి కిందా మీదా అవుతున్నారు. ఓ పక్క పవన్ అపాయింట్ మెంట్ కోసం ట్రయ్ చేస్తున్నారు. కానీ ఆయన ఇంకా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక బ్రహ్మాస్త్రం వాడాల్సిందే అని ఆయన భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ బ్రహ్మాస్త్రమే మాజీ సిఎమ్ చంద్రబాబు రికమెండేషన్. చంద్రబాబుతో రాజమౌళికి సన్నిహిత సంబంధాలు వున్నాయి. అమరావతి కోసం రాజమౌళికి డిజైన్లు తయారు చేయించారు కూడా.
చంద్రబాబు చెబితే పవన్ కళ్యాణ్ వింటారు అనే టాక్ వుంది. అందువల్ల చంద్రబాబు ద్వారా పవన్ కు చెప్పించి భీమ్లా నాయక్ ను వెనక్కు జరుపుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారనీ గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
నిజంగా రాజమౌళి అడగాలే కానీ, బాబుగారు చెబుతారు.. చంద్రబాబు చెప్పాలే కానీ పవన్ బాబు ఊ అనకతప్పదని టాక్ వినిపిస్తోంది.