ఓ సినిమా పబ్లిసిటీ అంటే దానికి ఓ పద్దతి, వ్యవహారం వుంటుంది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా తప్పదు. చిన్న సినిమా అయితే మరీ ఎక్కువ చేయాలి. ఎందుకంటే జనాలకు రీచ్ కావాలి కనుక.
ఆ మధ్య ఓ చిన్న సినిమా వస్తే పెద్ద పెద్ద హీరోలు ఇన్ వాల్వ్ అయి ప్రచారం సాగించారు. అంతలా చేస్తే తప్ప ఆ సినిమాకు అయినా మరే సినిమాకు అయినా మినిమమ్ ఓపెనింగ్స్ రావు.
అలాంటిది నాగ్ తన అన్నపూర్ణ బ్యానర్ మీద నిర్మిస్తున్న 'అనుభవించు రాజా' సినిమాను సింపుల్ గా వదిలేసారు. సుప్రియ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకు. హీరో హీరోయన్లు ఇద్దరూ ప్రెస్ మీట్లు, గేమ్ షోలు, కాలేజ్ విజిట్ లు మినహా మరేమీ లేదు.
కనీసం ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేదు. నాగార్జున, నాగ్ చైతన్య లాంటి హీరోలు వున్నారు సినిమా వెనుక. కానీ ఆన్ లైన్ లో ట్రయిలర్లు, టీజర్లు వదలడం మినహా మరేం చేయలేదు. పోనీ నాగ్ -చైతన్య షూటింగ్ లో బిజీగా వుండొచ్చు. కానీ నాగ్ చెబితే చాలా మంది హీరోలు సపోర్ట్ చేస్తారు. కానీ ప్రయత్నమూ చేసినట్లు కనపడలేదు.
నాగ్ ఇన్ ఫ్లూయెన్స్ ఎక్కడ కనిపించిందీ అంటే టీమ్ ను తీసుకెళ్లి బిగ్ బాస్ షో లో పరిచయం చేసారు. అంతవరకే. ఈవారం విడుదలవుతోందీ సినిమా. రాజ్ తరుణ్ లాంటి చిన్న హీరో, చిన్న దర్శకుడు వున్నపుడు మొదటి నుంచీ ప్లాన్డ్ గా బజ్ తీసుకురావాలి. ఆ ప్రయత్నం ఈ సినిమాకు అస్సలు జరగలేదు అన్నది వాస్తవం.