డిసెంబర్ నెల సినిమా డైరీ ఫుల్ అయిపోతోంది. తొలివారంలోనే బాలయ్య-బోయపాటి కాంబో అఖండ సినిమా డేట్ పడిపోయింది. విడుదలకు రెడీ అయిపోయింది. ఆ వెంటనే స్కైలాబ్ సినిమా వస్తోంది.
మలి వారంలో మూడు సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. నాగశౌర్య-లక్ష్య, కీర్తి సురేష్ గుడ్ లక్ సఖీ కూడా డేట్ లు కొట్టేసాయి.
అక్కడికి వారం తిరగకుండానే బన్నీ-సుకుమార్ పుష్ప సినిమా వుంది. ఆ పై వారం నాని-శ్యామ్ సింగ రాయ్ వుండనే వుంది. ఇవి కాక మలయాళ భారీ సినిమా, హాలీవుడ్ పెద్ద సినిమాలు వుండనే వున్నాయి. అంటే దాదాపు పది సినిమాల వరకు డిసెంబర్ లోనే జనాలు చూడాల్సి వస్తుంది.
కేవలం కీలకమైన సినిమాలు లెక్క వేసుకున్నా, దాదాపు 225 కోట్ల వరకు షేర్ రూపంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క డిసెంబర్ నెలలోనే రావాల్సి వుంటుంది. అంటే 350 గ్రాస్ అనుకోవచ్చు. అంటే రోజుకు దాదాపు పది కోట్లకు పైమాటే. చూడాలి డిసెంబర్ లెక్కలు ఎలా వుంటాయో?