తొక్కిసలాటకు బాధ్యత వహించిన సంగీత దర్శకుడు

ఊహించని విధంగా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. తన సంగీతంతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ఇప్పుడు కొంతమంది అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు.  Advertisement…

ఊహించని విధంగా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. తన సంగీతంతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ఇప్పుడు కొంతమంది అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. 

ఇంతకీ ఏం జరిగింది.. నిన్న రాత్రి చెన్నైలో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాడు రెహ్మాన్. నిజానికి ఇది నిన్న నిర్వహించాల్సిన కార్యక్రమం కాదు, గత నెల్లోనే ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ వర్షాల కారణంగా రద్దయిన ఈ కార్యక్రమాన్ని నిన్న పూర్తిచేశారు. అయితే ఇందులో అపశృతి దొర్లింది.

సరైన ఏర్పాట్లు చేయని కారణంగా అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. 2000 రూపాయలు పెట్టి గోల్డ్ పాసులు తీసుకున్న వాళ్లు కూడా లోపలకు వెళ్లలేకపోయారు. ఒకరినొకరు నెట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో వందల మంది టిక్కెట్లు ఉన్నప్పటికీ వెనుదిరగాల్సి వచ్చింది. తొక్కిసలాటలో ఇద్దరు సొమ్మసిల్లి పడిపోయారు కూడా.

జరిగిన ఘటనపై కాస్త ఆలస్యంగా స్పందించాడు రెహ్మాన్. తను పూర్తిగా కన్సర్ట్ పైనే దృష్టి పెట్టానని, ప్రాంగణం బయట ఏం జరిగిందో తనకు తెలియదని అన్నాడు. అయినప్పటికీ జరిగిన ఘటనకు చాలా చింతిస్తున్నానని, తనే నైతిక బాధ్యత తీసుకుంటానని కూడా ప్రకటించాడు.

ఈ మేరకు కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ తో పాటు, మెయిల్ ఐడీ కూడా ప్రకటించాడు రెహ్మాన్. ఎవరైతే టికెట్లు తీసుకొని మరీ షోకు హాజరుకాలేకపోయారో, వాళ్లంతా తమ విజ్ఞప్తుల్ని సమర్పించాలని.. అటువంటి వాళ్లతో తమ టీమ్ టచ్ లోకి వస్తుందని ప్రకటించాడు.

దేశవిదేశాల్లో లైవ్ కన్సర్ట్స్ నిర్వహిస్తుంటాడు రెహ్మాన్. స్వదేశంలో కూడా ఎన్నో కచేరీలిచ్చాడు. అయితే సొంత ఊరు చెన్నైలో చాలా రోజుల తర్వాత ఏర్పాటుచేసిన కార్యక్రమం కావడంతో, అభిమానులు పోటెత్తారు. దానికితోడు నిర్వహకులు కూడా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో.. లోపల కార్యక్రమం హిట్టయినా, బయట అట్టర్ ఫ్లాప్ అయింది.