డిస్కోరాజా..టీజర్ల పజిల్

సాధారణంగా ఏ సినిమాకు అయినా ఒక టీజర్ వుంటుంది. లేదా మహా అయితే రెండు టీజర్లు వుంటాయి. కానీ రాబోయే రవితేజ సినిమాకు అంతకన్నా ఎక్కువ టీజర్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఓ…

సాధారణంగా ఏ సినిమాకు అయినా ఒక టీజర్ వుంటుంది. లేదా మహా అయితే రెండు టీజర్లు వుంటాయి. కానీ రాబోయే రవితేజ సినిమాకు అంతకన్నా ఎక్కువ టీజర్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఓ టీజర్ ను అయితే రెడీ చేసారు. సినిమా ఆరంభంలో వదిలిన టీజర్ కు ఇది అదనం.

విఐ ఆనంద్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రలు పోషించాడు. ఇందులో ఓ పాత్ర కోమాలోకి వెళ్లి మళ్లీ వస్తుంది. దాంతో వయస్సు పెరిగినా లుక్ అలాగే యంగ్ గా వుంటుంది.

ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను జనవరి మూడోవారంలో విడుదల చేస్తున్నారు. ఈ లోగా మూడు నాలుగు డిఫరెంట్ టీజర్లు వదిల్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన చేస్తున్నారు. డిసెంబర్ నుంచి జనవరి  విడుదల వరకు టీజర్లు, సాంగ్స్ విడుదల చేస్తూ హడావుడి చేయాలన్నది ప్లాన్. 

మరి మూడు నాలుగు టీజర్లు వదిలిన తరువాత ఇంకా ట్రయిలర్ వదులుతారా? లేక ఈ టీజర్లు అన్నీ కలిసి ఓ ట్రయిలర్ గా మారుస్తారా? అన్నది చూడాలి.  మూడు వరుస డిజాస్టర్ల  తరువాత రవితేజ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా హిట్ కావాల్సి వుంది. లేదూ అంటే ఆ తరువాత వచ్చే గోపీచంద్ మలినేని సినిమా మీద దీని ప్రభావం కచ్చితంగా వుంటుంది.