Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రూలర్ బిజినెస్ ప్రారంభం

రూలర్ బిజినెస్ ప్రారంభం

బాలయ్య సినిమాల్లో లాభాలు చేసుకున్నవి చాలా అరుదుగా వుంటాయి. అయినా సినిమాలు తీస్తూనే వుంటారు. అమ్ముతూనే వుంటారు. కొంటూనే వుంటారు. ఎందుకంటే నిర్మాతల సంగతి ఎలా వున్నా, బయ్యర్లు దగ్గర దగ్గర బ్రేక్ ఈవెన్ అయిపోతూ వుంటారు. బాలయ్య కు వున్న మాస్ పుల్లింగ్ పవర్ కారణంగా. 

లేటెస్ట్ గా వస్తున్న బాలయ్య సినిమా రూలర్. ఈ సినిమా బిజినెస్ కూడా ప్రారంభమైపోయింది. ఆంధ్ర 10 కోట్ల రేషియోలో అమ్ముతున్నారు. బాలయ్య సినిమా ఈ రేంజ్ బిజినెస్ అంటే కాస్త ఆశ్చర్యమే. అయినా వాస్తవమే. అప్పుడే ఆంధ్ర లో చాలా ఏరియాల బిజినెస్ ను నిన్న, ఇవ్వాళ క్లోజ్ చేసారు. వైజాగ్ సతీష్, ఈస్ట్ సత్యనారాయణ, వెస్ట్ ఉషా బాలకృష్ణ, కృష్ణ అలంకార్ ప్రసాద్ అగ్రిమెంట్లు చేసుకున్నట్లు బోగట్టా. గుంటూరు సుబ్బారావు కు కావచ్చు.

సీడెడ్ లో ఎలాగూ బాలయ్య క్రేజ్ కొంతయినా వుంటుంది కాబట్టి బిజినెస్ సమస్య లేదు. నైజాం బహుశా ఓన్ రిలీజ్ వుంటుంది. బాలయ్య-కేఎస్ రవికుమార్ జత కట్టి సినిమా చేయడం ఇది ఈ మధ్యకాలంలో రెండోసారి.

ఇటు పోలీస్ గా అటు మాఫియా డాన్ గా రెండు షేడ్స్ లో బాలయ్య కనిపిస్తాడు. సినిమా అంతా ఫైట్లు..పాటలు మధ్య కథ నడిచే విధంగా డిజైన్ చేసినట్లు బోగట్టా. బాలయ్య ఫ్యాన్స్ కోసం నాలుగు భారీ ఫైట్లు సినిమాలో చొప్పించారు. అంటే బోయపాటి స్టయిల్ లో కేఎస్ రవికుమార్ సినిమా వుండబోతోందన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?