హీరో రాజశేఖర్ కు ఇక ఆ అర్హత లేనట్టే?

రీసెంట్ గా ఓ భారీ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు హీరో రాజశేఖర్. ఓఆర్ఆర్ పై జరిగిన ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారాయన. అయితే ఈ ప్రమాదం పూర్తిగా రాజశేఖర్…

రీసెంట్ గా ఓ భారీ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు హీరో రాజశేఖర్. ఓఆర్ఆర్ పై జరిగిన ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారాయన. అయితే ఈ ప్రమాదం పూర్తిగా రాజశేఖర్ స్వీయ తప్పిదం.

అతివేగంతో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్థారించారు. ఇక్కడితో ఈ వ్యవహారం ముగిసిపోలేదు. రేపోమాపో తన డ్రైవింగ్ లైసెన్స్ ను పూర్తిగా కోల్పోబోతున్నారట రాజశేఖర్.

తాజా యాక్సిడెంట్ జరిగినప్పుడే రాజశేఖర్ పై ఉన్న చలాన్ల వ్యవహారం బయటకొచ్చింది. రాష్ డ్రైవింగ్ ఆయనకు కొత్తకాదని ఆ చలాన్లు చూస్తేనే అర్థమౌతుంది. అలా రాజశేఖర్ పేరిట చాలా చలాన్లు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో ఒక చలాన్ లో ఆయన అత్యథికంగా 160 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్లినట్టు తెలుస్తోంది.

వీటిని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీసులు చర్యలకు సిద్ధమౌతున్నారు. కొన్నాళ్ల పాటు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు రవాణాశాఖకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లేఖ రాశారు.

రాజశేఖర్ కు వ్యతిరేకంగా రవాణా శాఖ నిర్ణయం తీసుకుంటే.. అతడి డ్రైవింగ్ లైసెన్స్ ను ఏడాది పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. సస్పెన్షన్ టైమ్ లో డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే జైలుకే. 

రీసెంట్ గా యాంకర్ ప్రదీప్ తో పాటు మరికొంతమంది సెలబ్రిటీల డ్రైవింగ్ లైసెన్సుల్ని రవాణా శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఇవన్నీ నెల, 2 నెలల కాలవ్యవథిలోనే తీరిపోయాయి. వాళ్లంతా ఆ టైమ్ లో డ్రైవర్లను పెట్టుకొని మేనేజ్ చేశారు. అయితే రాజశేఖర్ విషయంలో మాత్రం ఇంకాస్త కఠినంగా వ్యవహరించాలని రవాణాశాఖ భావిస్తోంది.

ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. డ్రైవర్ ను అస్సలు ఎంకరేజ్ చేయరు రాజశేఖర్. ఎంతదూరమైనా తనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తారు. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా ఆయన వేకువజామున రామోజీ ఫిలింసిటీ నుంచి ఒంటరిగా వస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయితే అది రాజశేఖర్ కు ఇబ్బందికరమే