హీరో నాని లేటెస్ట్ గా ఓకె చేసిన సినిమా పట్టాలు ఎక్కడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం చేస్తున్న ' వి ' సినిమా పూర్తి అయ్యేలోగానే ఈ సినిమాను కొంత అయినా ఫినిష్ చేయాలని ప్లానింగ్ లో వున్నారు. వాస్తవానికి ఇవ్వాళ, రేపో పూజ చేయించాలని అనుకున్నారు కానీ, మళ్లీ వాయిదా వేసారు.
నగర శివార్లలో ఓ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి, దారుణంగా చంపేసిన సంఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా వుంటే దర్శకుడు శివ నిర్వాణ ఈసారి నాని కోసం పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో కథ రెడీ చేసినట్లు తెలుస్తోంది. సినిమా మొత్తం గోదావరి జిల్లా పల్లెటూరి నేపథ్యంలోనే వుంటుంది. ఆరుగురో, ఏడుగురో అన్నదమ్ముల్లో మధ్య వాడిగా నాని క్యారెక్టర్ వుంటుంది. వారి కోసం ఏమైనా చేసేంత అభిమానాలు, ఆప్యాయతలు వుండే క్యారెక్టర్ ను నాని పోషిస్తున్నాడు.
ఇలా అన్నదమ్ములు, మధ్యలో చిన్నోడు, వాళ్ల కోసం ఏమైనా చేసేయడం అంటే పాత గ్యాంగ్ లీడర్ సినిమా గుర్తుకు వచ్చేస్తోంది. అయితే శివనిర్వాణ మాస్ స్టయిల్ చేయడు..పక్కా ఫ్యామిలీ ఎమోషన్లు, ఫన్ చూసుకుంటాడు కాబట్టి, కచ్చితంగా ఇంకోదో వ్యవహారం వుండే వుంటుంది.
ఇదిలా వుంటే ఈ సినిమా కోసం రీతూ వర్మను హీరోయిన్ గా తీసుకున్నట్లు యూనిట్ వెల్లడించేసింది.
పెళ్లి చూపులు సినిమా మినహా సరైన సోలో హిట్ లు లేవు అమ్మడి ఖాతాలో. నవీన్ చంద్ర, నిఖిల్ వంటి మీడియం హీరోల పక్కన చేసి కూడా ఫ్లాపులే ఇచ్చింది. మరి ఎవడే సుబ్రహ్మణ్యం పరిచయం తో తీసుకున్నారో? మరెవరు దొరకలేదో? లేదా శర్వానంద్ పక్కన ఓ సినిమా చేస్తోంది కదా అని మళ్లీ తీసుకున్నారో? లేదూ నానికి తొమ్మిది కోట్లు ఇచ్చి, మళ్లీ టాప్ హీరోయిన్ ను తీసుకువస్తే, ఎక్కువ రెమ్యూనిరేషన్ ఇవ్వాలని ఇక్కడితో సరిపెట్టుకున్నారో? మొత్తం మీద రీతూనే హీరోయిన్.