పరుశురామ్ కెరీర్ లో పెద్ద సినిమా

డైరక్టర్ పరుశురామ్ ఇప్పటి వరకు తీసినవీ అన్నీ చిన్న సినిమాలే. రవితేజ తో చేసిన సారొచ్చారు ఒక్కటే కాస్త పెద్ద సినిమా. పెద్ద స్టార్ కాస్ట్ తో వచ్చిన ఆ సినిమా ఆశించిన మేరకు…

డైరక్టర్ పరుశురామ్ ఇప్పటి వరకు తీసినవీ అన్నీ చిన్న సినిమాలే. రవితేజ తో చేసిన సారొచ్చారు ఒక్కటే కాస్త పెద్ద సినిమా. పెద్ద స్టార్ కాస్ట్ తో వచ్చిన ఆ సినిమా ఆశించిన మేరకు విజయం కాలేదు. ఆ తరువాత మళ్లీ చిన్న సినిమాలు తీసి ఓకె అనిపించుకున్నారు. చిన్న సినిమాగా తీసిన గీత గోవిందం పెద్దహిట్ అయింది. దీంతో మళ్లీ పరుశురామ్ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నారు.

కేవలం పరుశురామ్ కే ఎనిమిది కోట్ల రెమ్యూనిరేషన్, లాభాల్లో వాటా ఇవ్వడానికి 14 రీల్స్ సంస్థ ఓకె అంది. నాగ్ చైతన్య హీరో. అంటే మరో ఆరు కోట్లు. రష్మిక హీరోయిన్ అని టాక్. అంటే కనీసం మరో కోటి రూపాయిలు. దాంతో హీరో, హీరోయిన్, డైరక్టర్ల కే 15 కోట్ల బడ్జెట్ అయిపోతోంది.

మిగిలిన స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ అంతా కలిపి మరో అయిదు కోట్లు అన్నా కావాలి. ఇక ఆపై సినిమా ప్రొడక్షన్. లెక్క వేసుకుంటే దాదాపు ముఫై నుంచి ముఫై అయిదు కోట్ల బడ్జెట్. నాగ్ చైతన్య మీద ఆ బడ్జెట్ రాబట్టడం అంటే సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు గుర్తుకు వస్తాయి. మరి ఏ ధైర్యంతో 14 రీల్స్ సంస్థ ఈ ప్రాజెక్టును తలకెత్తుకుంటోందో?

మొన్నటికి మొన్న వాల్మీకి సినిమాను కూడా ఓవర్ బడ్జెట్ చేసుకున్నారు. హిట్ అనిపించుకుంది కాబట్టి సరిపోయింది.  ఏమైనా 14రీల్స్ సంస్థకు కాస్త ధైర్యం ఎక్కువే. నితిన్ తో లై సినిమా కూడా ఇలాగే ముఫై అయిదు కోట్లు పెట్టి ధైర్యం చేసారు. ఇప్పుడు అదే చేస్తున్నట్లుంది.