గుండెలపై తన్నించిన డైరక్టర్

తమిళ దర్శకులు సహజత్వాన్ని కోరుకుంటారు. అలా అని బూటు కాలితో గట్టిగా గుండెలపై తన్నిస్తే తెలుగు నటులు భరించగలరా? అమ్మనా బూతులు తిట్టరూ. అదే జరిగింది అర్జున్ సురవరం సినిమా షూట్ లో. Advertisement…

తమిళ దర్శకులు సహజత్వాన్ని కోరుకుంటారు. అలా అని బూటు కాలితో గట్టిగా గుండెలపై తన్నిస్తే తెలుగు నటులు భరించగలరా? అమ్మనా బూతులు తిట్టరూ. అదే జరిగింది అర్జున్ సురవరం సినిమా షూట్ లో.

విషయం ఏమిటంటే తమిళ దర్శకుడు సంతోష్ ఈ సినిమాకు దర్శకుడు. సినిమాలో పోసాని కృష్ణ మురళి చనిపోయే సీన్ వుంది. ఈ సీన్ ను అయిదు రోజులు తీసాడు డైరక్టర్. సినిమాలో మాత్రం అంత కనిపించదు వేరే సంగతి.

అయితే ఈ సీన్ లో విలన్ పోసానిని బూటుకాలితో గట్టిగా గుండెలపై కొట్టినట్లు చిత్రీకరించే సీన్ డిజైన్ చేసాడు డైరక్టర్. అయితే క్లోజప్ లో జూనియర్ ఆర్టిస్ట్ చేత కొట్టించినట్లు తెలుస్తోంది. ఆ కొట్టడం కూడా గాట్టిగా వెనక్కు పడే రేంజ్ లో కొట్టించినట్లు బోగట్టా.  దాంతో చాలా గట్టిగా తగిలేసరికి, ఏమిటి అని పోసాని కనుక్కుంటే డైరక్టర్ అలా కొట్టమన్నారని జూనియర్ ఆర్టిస్ట్ వివరణ ఇచ్చాడు.

దాంతో ఇక పోసాని డైరక్టర్ మీద తిట్ల పురాణం లంఘించుకున్నారట. మళ్లీ ఇలాంటి అలాంటి తిట్లుకాదు అచ్చ తెనుగు తిట్లు. అవి అర్థం కాక, వాటి అర్థం ఏమిటి అని ఆ తమిళ డైరక్టర్ పక్కన వున్నవాళ్లను అడగడం, వాళ్లు ఆ తిట్లు తమిళంలో వివరించలేక, పక్కకు తప్పుకోవడం మహా రసవత్తరంగా జరిగిందట. సినిమా విడుదలయిన తరువాత బయటకు వచ్చిందీ వ్యవహారం.