నాని దసరా సినిమా దిల్ రాజు క్యాంప్ కు చేరింది. దసరా సినిమాను దిల్ రాజు తన ఫోల్డ్ లోకి తీసుకున్నారని తెలుస్తోంది. విషయం ఏమిటంటే దసరా సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను హోల్ సేల్ గా అమ్మేసారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. మంచి రేటుకే కొన్నారు చదలవాడ శ్రీనివాసరావు.
నిన్న వచ్చిన దసరా టీజర్ ఇండస్ట్రీ జనాలను భయంకరంగా ఆకట్టుకుంది. ఎవరీ కొత్త దర్శకుడు అని మాట్లాడుకోవడం ప్రారంభించారు. టీజర్ వచ్చిన వెంటనే దిల్ రాజు మాంచి ఆఫర్ ఇచ్చి చదలవాడ శ్రీనివాసరావు దగ్గర తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
చదలవాడ కొన్నదానికి దిల్ రాజుకు అమ్మిన దానికి మధ్య మూడు నుంచి నాలుగు కోట్ల వత్యాసం వున్నట్లు బోగట్టా. చదలవాడ సినిమాను కన్నా ఏరియాల వారీ అమ్మడానికే. అలాంటిది మంచి లాభంతో హోల్ సేల్ బేర్ వస్తే ఇంకా ఆనందం కదా? సింగిల్ పాయింట్ లో పనైపోయింది. దిల్ రాజుకు తన టీమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్లు ఎలాగూ వున్నారు.
నాని ఈ దసరా సినిమా మీద చాలా హోప్ తో వున్నారు. తనకు నటుడిగా మంచి పేరు తెస్తుందని, కమర్షియల్ గా కూడా మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారు. సినిమాను హిందీలో కూడా నేరుగా విడుదల చేసే సన్నాహాలు జరుగుతున్నాయి.