ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు కొరటాలతో చేయబోయే సినిమా కోసం. కానీ ఇప్పటికి ఊ..ఆ..లేదు. ఏ సమాచారం లేదు. దాంతో ఫ్యాన్సీ డీలా. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు వస్తుందో అని. ఎందుకంటే కనీసం ఏడెనిమిది నెలలు పడుతుంది కదా. ఈ ఏడాది విడుదల వుంటుందా? వుండదా అనే డౌట్ అందుకే.
అయితే సేకరించిన సమాచారం ప్రకారం. ఈ నెలలో పెడదాం అనుకున్నారు. కానీ ఆస్కార్ ఫంక్షన్ కు వెళ్లాలి అనుకుంటే మళ్లీ బ్రేక్ ఇవ్వాలి. అందుకే ఫిబ్రవరి నెలాఖరు నుంచి ప్రారంభించి చిన్న షెడ్యూలు చేయడం కానీ లేదా మార్చి నుంచి పెద్ద షెడ్యూలు చేయడం కానీ అన్న డిస్కషన్లు సాగుతున్నాయి. మొత్తానికి ఈ రెండింటిలో ఒకటి పక్కా.
వన్స్ స్టార్ట్ అయ్యాక చకచకా షూట్ చేయాలనే దర్శకుడు కొరటాల, హీరో ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు. శంషాబాద్ సమీపంలో ఓ భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ సెట్ లో ఓ లెంగ్తీ షెడ్యూలు చేసిన తరువాత గోవా లో మరో షెడ్యూలు ప్లాన్ చేస్తున్నారు. గోవా షెడ్యూలు తరువాత మళ్లీ హైదరాబాద్ షెడ్యూలు వుంటుంది.
ఎన్టీఆర్ కోసం మాంచి పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసారు కొరటాల. పైగా ఆచార్య ఉదంతంతో మాంచి కసి మీద వున్నారు. అందువల్ల స్క్రిప్ట్ దశలోనే చాలా కేర్ తీసుకుంటున్నారు.