జెనీలియా.. టాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత ఆమె రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లాడింది. ఇప్పుడీ బ్యూటీ మరోసారి గర్భం దాల్చినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం, తాజాగా జెనీలియా నుంచి విడుదలైన ఫొటోలు, వీడియోస్.
ముంబయిలో ఓ ఈవెంట్ కు భర్తతో కలిసి హాజరైంది జెనీలియా. ఆమె చాలా వదులుగా ఉండే దుస్తులు ధరించింది. అంతేకాదు, ఫొటోలకు పోజులిచ్చినప్పుడు కూడా తన గర్భంపై చేయి పెట్టుకొని కనిపించింది. ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది.
దీంతో జెనీలియా మరోసారి గర్భందాల్చి ఉంటుందంటూ బాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ మేటర్ పై రితేష్ ఇంకా స్పందించలేదు.
జెనీలియా-రితేష్ పెళ్లి చేసుకొని 10 ఏళ్లు దాటింది. వాళ్ల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా, ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇప్పుడు మూడో సంతానాన్ని ఈ జంట ఆహ్వానించబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జెనీలియా గర్భందాల్చిన ప్రతిసారి ఆ విషయాన్ని రితేష్ ప్రకటించాడు. అయితే అప్పటికే అది మీడియాలో వైరల్ అయింది. ఇలా ప్రతిసారి లేటుగా స్పందించాడు రితేష్. ఈసారి కూడా ఇతడు కాస్త ఆలస్యంగా తను తండ్రిని కాబోతున్న విషయాన్ని వెల్లడిస్తాడని అంటోంది బాలీవుడ్ మీడియా.