300 మందికి బంగారు కాసులు

జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. దీంతో పుచ్చుకున్న రెమ్యూనరేషన్ కు అదనంగా ఖరీదైన బహుమతులు కూడా అందుకున్నారు కీలక సభ్యులు. హీరో రజనీకాంత్ కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించిన నిర్మాత కళానిధిమారన్,…

జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. దీంతో పుచ్చుకున్న రెమ్యూనరేషన్ కు అదనంగా ఖరీదైన బహుమతులు కూడా అందుకున్నారు కీలక సభ్యులు. హీరో రజనీకాంత్ కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించిన నిర్మాత కళానిధిమారన్, ఆ వెంటనే దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ కు కూడా ఖరీదైన కార్లను కానుకగా అందించాడు.

ఇక్కడితో జైలర్ బోనస్ ప్రక్రియ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ కళానిధిమారన్ ఇక్కడితో ఆగలేదు. ఈ సినిమాతో పెట్టిన పెట్టుబడికి మూడింతలు లాభం అందుకున్న ఈ నిర్మాత, సినిమాకు వర్క్ చేసిన 300 మందికి పైగా యూనిట్ సభ్యులకు బంగారు నాణాల్ని బహుకరించారు.

చెన్నైలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో జైలర్ సినిమా కోసం పని చేసిన 300 మందికి పైగా యూనిట్ సభ్యులకు గోల్డ్ కాయిన్స్ అందించారు నిర్మాత. ఈ కాయిన్స్ పై ఓవైపు జైలర్ అని ముద్రించారు, మరోవైపు సన్ పిక్చర్స్ లోగో పెట్టారు. ఇలా 300 మందికి పైగా ఈ కాయిన్స్ అందించారు.

అంతకంటే ముందు యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు నిర్మాత. తర్వాత అందరితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతతో పాటు, దర్శకుడు నెల్సన్ కూడా పాల్గొన్నారు. రజనీకాంత్ కు బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలనే తన చిరకాల కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు నిర్మాత. సినిమా సక్సెస్ అయితే, ఇలా అందరితో ఆ ఆనందాన్ని పంచుకునే ఆనవాయితీని ఇకపై కూడా కొనసాగిస్తానని అన్నారు.