40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇకపై జైల్లో ఊచలు లెక్కించాల్సిందే.. నిన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన బెయిల్ లభించలేదు. ఈ రోజు సుదీర్ఘ విచారణ అనంతరం ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు, సీఐడీ తరపున లాయర్లు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టులో చంద్రబాబు నాయుడు తన వాదనలు వినిపిస్తు.. తన అరెస్టు అక్రమమని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే నన్ను అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబు వాదనలు కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
కాగా నిన్న ఉదయం 6 గంటలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ అధికారులు 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేశారు. మొత్తానికి ఇప్పటి వరకు తాను పెద్ద నీతివంతున్ని అని చెప్పకొని తిరుగుతున్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం విశేషం. దీంతో ఇకపై చంద్రబాబు నాయుడు కూడా అక్రమ సంపాదనలో జైలుకు వెళ్లిన వ్యక్తిగ నిలవనున్నారు.
మరోవైపు కోర్టు అదేశాలతో సీఐడీ అధికారులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబోతున్నట్లు తెలస్తోంది.