టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న రాత్రంతా హైడ్రామా సృష్టించారు. ఎలాగైనా తను దైవంగా భావించే చంద్రబాబును చూడటం కోసం నిన్న సాయంత్రమే బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చేందుకు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ విజయవాడ వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కృష్ణా జిల్లా పోలీసులు ఎయిర్పోర్టు అధికారులకు మెయిల్ పంపారు. దీంతో ఎయిర్పోర్టు అధికారులు పవన్ విమానానికి అనుమతి నిరాకరించారు.
ఎయిర్పోర్టులో తన ప్రతేక్య విమానం వదిలి రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు బయల్ధేరిన ఆయన్ను ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా పవన్ రోడ్డుపై పడుకొని నిరసన తెలపడంతో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబును కలవనీయకుండా చేస్తున్న పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేందుకు వీసా కాలాలా అంటూ ప్రశ్నించారు.
పవన్ చేస్తున్న హడవుడితో చివరిగా పోలీసులు దగ్గర ఉండి పవన్ను పార్టీ కార్యాలయం వరకు వచ్చి వదిలేశారు. దీంతో జనసైనికులు తమ అధినేతకు చంద్రబాబు అంటే ఎంత మామకారం ఉందో అనీ గుసగుసలాడుతున్నారు. గత బస్సు యాత్రలో మంగళగిరిలో ఉంటా అని శపధం చేసిన పవన్ నెల రోజులుగా రెస్ట్ మూడ్లో ఉన్నారు. తీరా చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో అన్ని పనులు పక్కకు పెట్టి రాష్ట్రంలోకి అడుగుపెట్టడంతో చంద్రబాబు పాక్యేజీకి న్యాయం చేయడం కోసం ఇంత హడవుడి చేశారంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.