ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏ1 చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక సంచలన విషయాలు బయటపెట్టారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ. 550 కోట్ల స్కామ్ జరిగిందని.. ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండానే సెల్ కంపెనీలకు రూ. 370 కోట్లు విడుదల చేశారని విచారణలో తెలిందన్నారు.
ఈ స్కాం వెనుక ప్రధాన లబ్ధిదారుడిగా చంద్రబాబు నాయుడు ఉన్న విషయం తేలిందని.. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని అందుకే ముందుస్తుగా అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిధులన్నీ వికాస్ అనే వ్యక్తి ద్వారా హవాలా రూపంలో బదిలీ అయ్యయి అని.. ముఖ్యమైన పత్రాలు మాయం అవ్వడం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. ఇలాంటి ఆర్థిక కుట్రకు పది ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.
అలాగే ఈ స్కాంలో లోకేష్ పాత్ర కూడా ఉందని.. ఆయన్ను కూడా విచారించవలసిన అవసరం ఉందన్నారు. ఈ కేసును ఇప్పటికే ఈడీ, జీఎస్టీ సంస్థలు కూడా విచారణ చేస్తున్నాయన్నారు. అన్ని అధారాలు కోర్టుకు సమర్పిస్తామన్నారు. లోకేష్‌ను ఈ స్కాంతో పాటుగా ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్‌రోడ్ మళ్లింపు కేసుల్లో లోతుగా విచారించిన తర్వాత ఆయన అరెస్ట్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు.
కాగా చంద్రబాబు అరెస్ట్ ఉదయం 6 తర్వాతనే చేశామని.. 6 వరకు ఆయన్ను డిస్టర్బ్ చేయలేదని.. విజయవాడకు కూడా హెలికాప్టర్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు తన సొంత వాహనంలోనే విజయవాడకు వస్తానన్ని చెప్పినట్లు సీఐడీ చీఫ్ ప్రకటించారు.