మొత్తానికి లేటుగా అయినా టీడీపీ అధినేత చంద్రబాబు దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. ఏ విషయంలోను లేటు కాకుండా చంద్రబాబుకు, టీడీపీకి బాసటగా నిలిచే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్టు విషయంలో మాత్రం కాస్త లేటుగా డిఫరెంట్ గా అరెస్టును ఖండిస్తూ.. తనకు అలవాటు అయిన రీతిలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఓ వీడియోలో ఆయన చదువుతూ.. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అవలంభిస్తున్నారని.. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయాల్సింది పోలీసులైతే.. వైసీపీకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తూ.. నాయకుడు అరెస్ట్ అయితే.. కార్యకర్తలు, అభిమానులు బయటకు రావడం నిరసనలో భాగం. బయటకు రావొద్దంటే ఎలా?. ఇది కక్షసాధింపు చర్యే అంటూ పవన్ చదివి వినిపించారు.
కాగా కోట్ల రూపాయిలను దొచుకున్న చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేస్తే అర్థరాత్రి అరెస్ట్ చేశారని అనడం పవన్ కళ్యాణ్‌కే చెల్లింది. మరోవైపు చంద్రబాబుకు సపోర్ట్‌గా పవన్ కంటే ముందుగా పురందేశ్వరి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. గత నెలలో మంగళగిరిలోనే ఉంటా అంటూ ప్రకటించిన పవన్ గత నెల రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం లేదు. బహుశా చంద్రబాబు కోసం పవన్ ఆంధ్రలోకి వచ్చే అవకాశం ఉంది.