బాబుది రాజకీయ కన్నీరేనా… ?

తనలోని  భావోద్వేగాలను ఏనాడూ బయటపెట్టని చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. అది అందరికీ షాకింగ్ కలిగించే  విషయమే. ఇక్కడ చంద్రబాబు ఏడ్చారు అంటే అవునా ఏడ్చారా అన్న ఫీలింగ్ లో యావత్తు జనాలు ఉండిపోయారు.…

తనలోని  భావోద్వేగాలను ఏనాడూ బయటపెట్టని చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. అది అందరికీ షాకింగ్ కలిగించే  విషయమే. ఇక్కడ చంద్రబాబు ఏడ్చారు అంటే అవునా ఏడ్చారా అన్న ఫీలింగ్ లో యావత్తు జనాలు ఉండిపోయారు. ఎందుకంటే చంద్రబాబు ఎపుడూ తన భావాలను ఎక్కాడా ఏ కోశానా బయటపెట్టుకోరు.

అలాంటి బాబు మీడియా ముందు ఏడిస్తే దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఇప్పటికీ ఎవరికీ అర్ధం కావడంలేదు. అయిన వారూ బంధువులు అయితే బాబు కంట తొలిసారి ఇన్నేసి నీళ్ళు వచ్చాయని బాగానే  తల్లడిల్లారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే మా చంద్రన్న కంటికే నీరు తెప్పిస్తారా అంటూ అగ్గి అయ్యారు.

ఇతర రాజకీయ పక్షాల వారు అయితే బాబు కన్నీటికి కారణమైన విషయాల మీద బాధపడుతున్నామని చెప్పడంతో పాటు అసలు అలాంటి రాజకీయ పరిస్థితులు రావడం వెనక బాబు కూడా ఒక కారణం అన్నట్లుగా విశ్లేషిస్తున్నారు.

ఇక కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అయితే దీని మీద విశాఖ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో స్పందిస్తూ బాబు పెట్టినది రాజకీయ‌ కన్నీరే అని తేల్చేశారు. అంటే బాబు ఏడుపు వెనక కూడా పక్కా వ్యూహాలు ఉన్నాయన్నదే ఆయన అభిప్రాయంగా ఉంది. అదే సమయంలో ఏపీ అసెంబ్లీలో సరిగ్గా కార్యక్రమాలు జరగడంలేదు అంటూ కామెంట్స్ చేశారు. 

మొత్తానికి చూస్తే బాబుది రక్త కన్నీరు కాదని రాజకీయ కన్నీరే అన్నది చాలా మంది భావనగా ఉంది. మరి ఇది సగటు జనాల్లో ఏవిధమైన ఫీలింగ్ కలుగచేస్తుందో చూడాలి.