ఉప్పెన సినిమా తరువాత చకచకా సినిమాలు చేస్తోంది కృతిశెట్టి. లేటెస్ట్ గా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కూడా ఓకె చేసినట్లు బోగట్టా.
మెగాస్టార్ చిరంజీవి తనయ సుష్మిత కొణిదెల సినిమా నిర్మాణరంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో వెబ్ సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తున్న సుష్మిత కొణిదెల ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను కూడా టేకప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సబ్జెక్ట్ ప్రస్తుతం డిస్కషన్ లో వుంది. వన్స్ అప్రూవ్ కాగానే షూటింగ్ మొదలవుతుంది.
హీరొయిన్ ఓరియెండెట్ సబ్జెక్ట్ కావడంతో కృతి శెట్టిని తీసుకున్నారు. కథకు తగిన హీరో కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి, చైతన్యతో ఓ సినిమా, రామ్ తో మరో సినిమా ఫినిష్ చేసే పనిలో వుంది.