కుప్పంలో ఓట‌మిని డైవ‌ర్ట్ చేయ‌డానికి ఇంత‌కా?

ఇందుమూలంగా అర్థం అవుతున్న వ్య‌వ‌హారం ఏమిటంటే.. రాజ‌కీయం కోసం తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు దేన్నైనా, ఎందాకైనా లాగ‌గ‌ల‌డు. ఏపీలో ప‌లు చోట్ల టీడీపీ శ్రేణుల ఆందోళ‌న‌, మ‌రోవైపు నంద‌మూరి ఫ్యామిలీ మీడియా ముందుకు…

ఇందుమూలంగా అర్థం అవుతున్న వ్య‌వ‌హారం ఏమిటంటే.. రాజ‌కీయం కోసం తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు దేన్నైనా, ఎందాకైనా లాగ‌గ‌ల‌డు. ఏపీలో ప‌లు చోట్ల టీడీపీ శ్రేణుల ఆందోళ‌న‌, మ‌రోవైపు నంద‌మూరి ఫ్యామిలీ మీడియా ముందుకు రావ‌డం, హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం.. వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తే.. బ‌హుశా ఈ వ్య‌వ‌హార‌మే ప్ర‌స్తుతానికి టీడీపీకి రాజ‌కీయ అస్త్రం అనుకోవాల్సి వ‌స్తోంది! 

అస‌లు డైరెక్టుగా మాట వ‌చ్చిన సంద‌ర్భంలో ఉద్య‌మం చేసి ఉంటే అదో లెక్క‌. అక్క‌డ అన‌లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. అయినా.. అన్నారంటూ యాగీ చేయాలి! అందులోనూ అక్క‌డ మొద‌ట రెచ్చ‌గొట్టింది చంద్ర‌బాబే! 

బాబాయ్, త‌ల్లి, చెల్లి.. అంటూ కుటుంబ స‌భ్యుల ప్ర‌స్తావ‌న తెచ్చింది చంద్ర‌బాబే! త‌ల్లికి, చెల్లికి మోసం చేశావ్ అని చంద్ర‌బాబు అంటే జ‌గ‌న్ త‌ట్టుకోవాలి! ఈ మ‌ధ్య‌నే ష‌ర్మిల చంద్ర‌బాబు ఆప్తుడు వేమూరి రాధాకృష్ణ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది క‌దా.. అందులో ఏమైనా చెప్పిందా.. జ‌గ‌న్ త‌నకు చేసిన మోసం గురించి?  లేక విజ‌య‌మ్మ చెప్పారా? మ‌రి అలాంటి అంశంలో.. త‌ల్లి, చెల్లికి మోసం చేశావ్ అంటూ.. ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి మాట్లాడితే ఆయ‌న‌కో హృదయం ఉండ‌కూడ‌దు! ఆయ‌న‌కు బాధుండ‌దు.  అన‌క‌పోయినా.. చంద్ర‌బాబుకు మాత్రం బాధేస్తుంది, ఏడుపొస్తుంది!

ఎన్ని అన్నార్రా.. స్వామీ, ష‌ర్మిల‌- సినిమా హీరో అంటూ.. ఎన్ని ప్ర‌చారాలు చేశారు సోష‌ల్ మీడియాలో! ఒక టీడీపీ నేత ప్రెస్ మీట్లో డైరెక్టుగా ఈ వ్యాఖ్య చేశాడే! మోడీ గురించి ఎన్ని మాట‌ల‌న్నారు?  పెళ్లాన్ని ఏలుకోని వాడు దేశాన్ని ఏం ఏల‌తాడంటూ.. చంద్ర‌బాబు అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించ‌లేదా?

మీరేమో.. ఏదైనా మాట్లాడ‌తారు. ముఖ్య‌మంత్రి హోదాలోని వ్య‌క్తిని ప‌ట్టుకుని బోస్డీకే అంటారు! అదేమంటో బోస్డీకే చాలా ఉత్త‌మ ప‌దం అంటారు. మీ వ‌ర‌కూ వ‌స్తే మాత్రం.. అన‌కున్నా అరిచి గ‌గ్గోలు పెడ‌తారు! మీకు మీరే స‌ర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు. మీరే రోడ్డుకు ఎక్కుతారు! కుప్పంలో ఓట‌మిని డైవ‌ర్ట్ చేయ‌డానికి ఇంత‌కు దిగ‌జారాలా!