గోదావరి జిల్లాల్లోని ఓ మంత్రి పక్కాగా సెటిల్ అయిపోతున్నారని రాజకీయ వర్గాల్లో గ్యాసిప్ వినిపిస్తోంది. సిఎమ్ జగన్ ఎప్పుడు మంత్రి వర్గాన్ని మొత్తం మార్చేస్తారో లేదో తెలియదు. పోనీ కాస్త సంపాదించుకుందాం అంటే అంత అవకాశం కనిపించడం లేదు.
నిధుల విడుదల అంతంత మాత్రంగా వుంది. అందుకే హ్యాపీగా సెటిల్ మెంట్ లను నమ్ముకుని ఆ మంత్రి సెటిల్ అయిపోతున్నట్లు తెలుస్తోంది.
సౌమ్యుడు, మంచివాడు, జగన్ కు నచ్చిన మంత్రి అని పేరు తెచ్చుకున్న ఈ మంత్రి అవినీతి, నిధుల దుర్వినియోగం,అధికార దుర్వినియోగాల జోలికి పోవడం లేదట. సింపుల్ గా లాండ్ సెటిల్ మెంట్లనే నమ్ముకున్నారట. మళ్లీ అలా అని సెటిల్ మెంట్ల విషయంలో ఓ ప్రిన్సిపల్ కూడా పెట్టుకున్నారని టాక్.
ముందుగా అనుకున్న మొత్తానికి రూపాయి తగ్గినా సెటిల్ మెంట్ అక్కడిక్కడే ఆగిపోతుంది. వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చేస్తుంది. పైసలు పక్కా అయితే సెటిల్ మెంట్ హ్యాపీగా సెటిల్ అయిపోతుందట. జిల్లాలో మీడియా ఈయనకు సెటిల్ మెంట్ల మంత్రి అని నిక్ నేమ్ పెట్టుకుందని టాక్ వినిపిస్తోంది.
రాజకీయాల్లో సెటిల్ కావాలంటే ఆ మాత్రం వ్యవహార జ్ఞానం వుండాలి. లేదూ అంటే రాజకీయ నాయకుడికి మామూలు జనాలకు ఏం తేడా వుంటుంది.