బాల‌య్య మ‌రోసారి వివాదాస్ప‌ద కామెంట్స్‌!

అక్కినేని కుటుంబంపై టాలీవుడ్ అగ్ర‌హీరో, టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆయ‌న హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు ఇటీవ‌ల అక్కినేనిని ఉద్దేశించి తొక్కినేని…

అక్కినేని కుటుంబంపై టాలీవుడ్ అగ్ర‌హీరో, టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆయ‌న హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు ఇటీవ‌ల అక్కినేనిని ఉద్దేశించి తొక్కినేని అంటూ చేసిన కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్‌పై స్పందించాల‌ని బాల‌య్య‌ను కోరారు. వివాదానికి తెర‌దించే క్ర‌మంలో కొత్తది బాల‌య్య సృష్టించ‌డం గ‌మ‌నార్హం. అక్కినేని కుటుంబంలో ఆప్యాయ‌త‌లు లేవ‌ని సీరియ‌స్ కామెంట్స్ బాల‌య్య చేయ‌డం కొత్త రచ్చ‌కు దారి తీసింది.

అక్కినేనిపై తాను చేసిన కామెంట్స్‌కు బాల‌య్య వివ‌ర‌ణ ఏంటో తెలుసుకుందాం.

“అభిమానంతో అన్న మాట‌ల్ని వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తే నాకు సంబంధం లేదు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల‌ను అభిమానంగా మ‌రో ర‌కంగా కూడా పిలుస్తారు. అంత మాత్రాన వారిని అవ‌మానించిన‌ట్టు కాదు. నాగేశ్వ‌ర‌రావు నాకు బాబాయే. నేనంటే ఎప్ప‌టికీ ఆయ‌న‌కి చాలా ఇష్టం. నాగేశ్వ‌ర‌రావు త‌న పిల్ల‌ల కంటే ఎక్కువ‌గా న‌న్ను ప్రేమించేవారు. ఆప్యాయంగా ప‌ల‌క‌రించేవారు. ఎందుకంటే ఆప్యాయ‌త అక్క‌డ(అక్కినేని కుటుంబం)లేదు. ఇక్క‌డ ఉంది. బాబాయ్ అక్కినేని నుంచి పొగ‌డ్త‌ల‌కు దూరంగా ఉండాల‌నే విష‌యాన్ని నేర్చుకున్నా, బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో వుంటుంది. బ‌య‌ట ఏం జ‌రిగినా ప‌ట్టించుకోను. ప్లోలోలో అన్న మాట‌లే త‌ప్ప‌, ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన‌వి కావు” అని ఆయ‌న చెప్పుకొచ్చారు.  

అక్కినేని నాగార్జున త‌దిత‌ర కుటుంబ స‌భ్యులు నాగేశ్వ‌ర‌రావుపై ప్రేమ క‌న‌బ‌రిచే వారు కాద‌ని అర్థం వ‌చ్చే రీతిలో తాజాగా బాల‌య్య మాట్లాడారు. దీంతో అక్కినేని కుటుంబాన్ని, ఆయ‌న అభిమానుల్ని మ‌రింత రెచ్చ‌గొట్టిన‌ట్టైంది. ఇటీవ‌ల వీర‌సింహారెడ్డి స‌క్సెస్ మీట్‌లో త‌మ తాత‌ను బాల‌య్య కించ‌ప‌రిచేలా మాట్లాడ్డంపై నాగేశ్వ‌ర‌రావు మ‌నుమ‌ళ్లు నాగ‌చైత‌న్య‌, అఖిల్ ట్విటర్ వేదిక‌గా ఘాటుగా స్పందించిన సంగ‌తి తెలిసిందే.

“నంద‌మూరి తార‌క రామ‌రావు గారు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు క‌ళామ‌త‌ల్లి ముద్దు బిడ్డ‌లు. వారిని అగౌర‌ప‌ర‌చ‌టం మ‌న‌ల్ని మ‌నమే కించ‌ప‌రుచుకోవ‌డం” అని హీరో నాగార్జున త‌న‌యుళ్లు పోస్టును ట్వీట్ చేశారు. తాజాగా అక్కినేని కుటుంబంలో ప్రేమ లేద‌ని బాల‌య్య అన‌డంపై వారేమంటారో చూడాలి.