అమిగోస్.…రీమిక్స్ జాయింట్!

బింబిసార్ హిట్ కు ముందే మొదలు పెట్టి, తరువాత విడుదల చేస్తున్న కళ్యాణ్ రామ్ సినిమా ‘అమిగోస్’. ఒకేలా వుండే ముగ్గురి కథ ఇది. బింబిసార హిట్ తరువాత కళ్యాణ్ రామ్ సినిమాల మీద…

బింబిసార్ హిట్ కు ముందే మొదలు పెట్టి, తరువాత విడుదల చేస్తున్న కళ్యాణ్ రామ్ సినిమా ‘అమిగోస్’. ఒకేలా వుండే ముగ్గురి కథ ఇది. బింబిసార హిట్ తరువాత కళ్యాణ్ రామ్ సినిమాల మీద అంచనాలు పెరిగాయి. దాంతో సమ్ థింగ్ మోర్ అన్నది అవసరం పడింది. 

అందుకే సినిమాకు మరిన్ని పాజిటివ్ పాయింట్లు వుండేలా నెల రోజులు మరోసారి రీషూట్ చేసారు. అక్కడితో ఆగకుండా ఓ మాంచి సాంగ్ ను రీమిక్స్ చేసి సినిమాలో వుంచారు. 

బాలయ్య సూపర్ హిట్ రొమాంటిక్ సాంగ్ ఎన్నో రాత్రులు వచ్చాయి గానీ పాట ను రీమిక్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ నే స్వయంగా ప్రకటించారు. అమిగోస్ సినిమాను గట్టిగా ప్రమోట్ చేయాలని నిర్మాతలు మైత్రీ మూవీస్ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

సినిమా థియేటర్ హ్కక్కులను 9 కోట్లకు విక్రయించేసిన మైత్రీ సంస్థ, మంచి ఓపెనింగ్ రాబట్టే ప్రయత్నంలో వుంది. బింబిసార క్రేజ్ కు మరిన్ని యాడెడ్ పాయింట్లు కోసం చూస్తున్నారు. అందులో భాగంగా ఈ రిమిక్స్ ను యాడ్ చేస్తున్నారు.