మహాసముద్రం నిర్మాతకు కలిసిరాలేదు. దర్శకుడికీ కలిసి రాలేదు. కానీ ఓ జంట కలవడానికి పనికి వచ్చినట్లుంది.
తమిళ, తెలుగు సినిమాల హీరో సిద్దార్ధ మాంచి ఎమోషనల్ పర్సన్. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పగలడు. ఎవరికైనా దగ్గరైతే, ఆ రిలేషన్ ను ఓపెన్ గా అంగీకరించగలడు. ఇట్టే పట్టుకోగలడు..ఇట్టే కలిసిపోయి అడుగేయగలడు. అట్టే విడిపోయినా పెద్దగా ఫీల్ కాడు కూడా.
మహాసముద్రం తరువాత సిద్దూకి అదతిరావ్ హైదరి తో జత కలిసేసింది. అప్పటి నుంచి చెట్టపట్టాలు వేసుకునే తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా జంటగానే. చెన్నయ్ వెళ్లిన తెలుగు మీడియాకు సిద్దూ-అదితి కలిసే పిఎస్ వన్ ఫంక్షన్ కు రావడం కనిపించింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ కు కూడా మళ్లీ కలిసే వచ్చింది ఈ జంట.
హీరో శర్వానంద్ పెళ్లి నిశ్చితార్ధానికి సిద్దూ హాజరయ్యాడు అది కూడా అదితీ సమేతంగా. కొత్త పెళ్లి కొడుకు..కొత్త పెళ్లి కూతురు పక్కన అటు ఇటు ఈ ఇద్దరు నిల్చుని ఫొటొలు దిగారు. మొత్తానికి సినిమాల సంగతి ఎలా వున్నా సరదా సరదాగా గడిపేయడం బాగుంది ఈ జంట.