ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎంతో కాలం నిలవడం లేదు. పారాణి ఆరకముందే విడాకులు అంటున్నారు. టాలీవుడ్ లోని ఓ యువ దర్శకుడి వివాహ జీవితం కూడా ఇలాగే ముగిసిందని తెలుస్తోంది.
పెళ్లి జరిగి ఇంకా ఎంతో కాలం కాలేదు. సూపర్ హిట్ కోట్టిన సంబరం..ఆపై పెళ్లి చేసుకున్నారు. మళ్లీ మరో మంచి సినిమా చేతిలోకి వచ్చింది. కానీ ఇప్పుడు విడాకులు అంటూ వార్తలు.
ఏమిటో ఈ జనరేషన్ అనుకోవాలో? అభిప్రాయాలు కలవడం లేదు అని అనుకోవాలో? దాదాపు నెల రోజులుగా ఈ గ్యాసిప్ వినిపిస్తోంది. సన్నిహితులు ఎవర్ని అడిగినా అబ్బే.. అలాంటిదేం లేదు అంటూ వచ్చారు. ఒకరిద్దరు మాత్రం మాకు కూడా అలా వినిపిస్తోంది అంటూ వచ్చారు. ఇప్పుడు విడాకులే కన్ ఫర్మ్ అంటూ బలంగా వినిపిస్తోంది.
టాలీవుడ్ లో చాలా మందితో మంచి సాన్నిహిత్యం వున్న దర్శకుడు. పైగా అతని కుటుంబం కూడా టాలీవుడ్ లోని పలువురితో సాన్నిహిత్యం వున్న కుటుంబం. పెళ్లయి ఏడాది పూర్తి కాలేదో.. అయిందో. అందుకే ఈ గ్యాసిప్ వినిపిస్తున్నా నమ్మడానికి కాస్త టైమ్ పట్టింది. ఇప్పుడు అదే నిజమని వార్త చక్కర్లు కొట్టడం మొదలైంది.