టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల. అడిగిన వారు ఎవరికీ నో చెప్పకుండా డేట్ లు ఇస్తూ వస్తోంది. పగలు, రాత్రి ఏదో విధంగా టైమ్ అడ్జస్ట్ చేస్తూ షూటింగ్ లు చేస్తూ వస్తోంది. అంతే తప్ప ఈ సినిమా చేయను, ఆ సినిమా చేస్తాను అని అనడం లేదు.
ఒకే హీరోతో రెండు, లేదా ఓకే బ్యానర్ లో రెండు మూడు సినిమాలు ఓకె చేస్తూ వస్తోంది శ్రీలీల. మంచి సినిమా లేదా పెద్ద సినిమా, అలాగే మంచి బ్యానర్ లేదా పెద్ద బ్యానర్ అయితే చాలు శ్రీలీల ఓకె అంటూ వస్తోంది.
అలాంటిది ఓ పెద్ద బ్యానర్ లో ఓ పెద్ద హీరో సినిమాకు మాత్రం నో చెప్పిందని గ్యాసిప్ బలంగా వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాకు శ్రీలీలను తీసుకోవాలని మొదటి నుంచీ అనుకున్నారు. యూత్ సెన్సేషన్ హీరో, మంచి డైరక్టర్ కాంబినేషన్ ఇది. అసలు రష్మిక ఈ సినిమాలో చేస్తుందేమో అనుకున్నారు. కానీ కాదు శ్రీలీల అని వినిపించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గ్యాసిప్ ఏమిటంటే ఆ ప్రాజెక్టు శ్రీలీల చేయడం లేదు అని.
శ్రీలీలనే తను ఇప్పుడు డేట్ లు అడ్జస్ట్ చేయలేనని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. కానీ శ్రీలీల ఇలా డేట్లు అడ్జస్ట్ చేయలేనని చెప్పడమే ఆశ్చర్యం అని, అది కాక వేరే రీజన్ వుండి వుంటుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తోంది.