టీడీపీ అక్రమాల తాట తీయనున్న సంచయిత…?

ఆమె మామూలు మనిషి కాదు, ఘనత వహించిన పూసపాటి వంశీకుల మూడవతరం వారసురాలు. న్యాయవాదిగా  ఉన్న ఆమె ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె. తండ్రి స్థానంలో కూతుళ్ళు కూడా ఉన్నత స్థానంలో ఉండొచ్చు అని చెప్పడానికే…

ఆమె మామూలు మనిషి కాదు, ఘనత వహించిన పూసపాటి వంశీకుల మూడవతరం వారసురాలు. న్యాయవాదిగా  ఉన్న ఆమె ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె. తండ్రి స్థానంలో కూతుళ్ళు కూడా ఉన్నత స్థానంలో ఉండొచ్చు అని చెప్పడానికే ఆమె సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ అయ్యారు.

ఇక ఆమె కుర్చీ ఎక్కీనది లగాయితూ టీడీపీ నేతల పూనకాలు మామూలుగా లేవు. సింహగిరి కొండకు తామే అసలైన పెత్తందారులుగా ఊహించేసుకుంటూ ఆస్థిక జనులు తమ కంటే వేరెవరూ  లేరంటూ పెద్ద గొంతు చేస్తున్నారు. పరమ భక్తులం అంటూనే అందరూ కొలిచే అప్పన్న ఆలయం మీద తెలియకుండానే విమర్శలు చేస్తున్నారు.

తమ రాజకీయం కోసం ఇదంతా చేస్తూ భక్తుల కోసమంటున్నారు. నిజానికి సింహ‌గిరి కొండమీద ఉన్న వందలాది ఎకరాలు చాలా ఏళ్ళ క్రితమే అన్యాక్రాంతం అయ్యాయి.  వైసీపీ అధికారంలోకి అచ్చి ఏడాది మాత్రమే అయింది. సంచయిత చైర్ పర్సన్ అయి ఆరు నెలలు నిండలేదు కానీ అక్రమాలు అన్నీ కూడా ఇపుడే  పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయంటూ తమ్ముళ్ళు  యాగీ చేయడం మొదలెట్టారు.

సంచయిత, వైసీపీ అంటే గిట్టని తమ్ముళ్లు ఇలా బాణాలు ఎక్కుపెట్టారన్న మాట. మరి సంచయిత ఊరుకుంటుందా అందుకే ఎక్కడి భూములు అక్రమాలకు గురి అయ్యాయో చూద్దమంటూ ఏకంగా ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించడానికి ఆర్డర్ వేశారు. దాంతో వణికిపోవడం తమ్ముళ్ళ వంతు అవుతోంది.

అయిదేళ్ల పాటు టీడీపీ నేతలు దేవుడి భూములు ఆక్రమించుకున్నారని ఆమె ఆరోపించారు. ఆ వివరాలు అన్నీ ఆధారాలతో సహా బయటకు తీయడానికే ఫోరెన్సిక్ ఆడిట్ అని సంచయిత అంటున్నారు. మొత్తానికి రాజకీయ రచ్చ చేయబోయి తామె ఇరుక్కునే సీన్ తెచ్చుకున్నారు తమ్ముళ్ళు అంటున్నారు.  ఏ ఒక్కరినీ వదిలెపెట్టేది లేదు, అప్పన్న ఆస్తులను కాపాడుతామని సంచయిత చేస్తున్న గర్జనతో పచ్చ పార్టీ నేతలకు నిద్ర పట్టడంలేదుగా.