పసిపాపలపై లైంగిక వేధింపులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. స్కూల్ పిల్లలపై కామాంధులు తెగబడుతున్నారు. ముంబైలో జరిగిన దారుణం మరీ నీఛమైంది. 20నెలల పసిపాప, లోకం ఏంటో తెలియని వయసు, ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటున్నారో లేక దుర్భుద్దితో మనసుకు హత్తుకున్నారో తెలియని పరిస్థితి.
అలాంటి పసిపాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. చివరకు ఆ పసిపాప బాధతో ఏడుస్తుంటే తల్లిదండ్రులకు అనుమానం వచ్చి చెక్ చేసి నివ్వెరపోయారు. ఆ దుర్మార్గుడిపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.
సెంట్రల్ ముంబైలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి ఓ అపార్ట్ మెంట్లో నివశిస్తున్న కుటుంబం.. అర్జంట్ పనిపై సొంత ఊరికి వెళ్లింది. వెళ్తూ వెళ్తూ పక్క ఇంట్లో ఉండే 35 ఏళ్ల వ్యక్తికి తమ పాపను కాసేపు చూసుకోవాలని చెప్పి వెళ్లారు అమ్మ, నాన్న. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చే సరికి పాప ఏడుస్తూ ఎదురొచ్చింది.
చాలాసేపు తాము కనపడనందుకు ఏడుస్తుందేమోనని పొరపడ్డారు. ఇంటిలోకి వెళ్లినా పాప ఏడుపు ఆపలేదు. నొప్పి నొప్పి అంటూ అల్లాడిపోయింది. చివరకు తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో పాపపై లైంగిక దాడి జరిగినట్టు అర్థమైంది.
పాప తల్లిదండ్రులు సెంట్రల్ ముంబై పోలీసుల్ని ఆశ్రయించారు. వెంటనే పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. పెద్దవాడు కదా అని నమ్మి చిన్నారిని అప్పగిస్తే, ఇంతకు తెగించాడు ఆ నీచుడు.
భారత్ లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలలో నూటికి 70శాతం తెలిసినవారి పనే. నమ్మకంగా ఉంటూ బాలికలకు, మహిళలకు చేరువై వారిపై అఘాయిత్యాలు చేస్తున్నారు. ముంబైలో జరిగిన ఘటన ఈ కోవలో మరొకటి.