సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ''హీరో కృష్ణ ఇచ్చిన స్ఫూర్తి ధైర్యంతో హంట్ సినిమా చేసా అన్నారు. ఇందులో కొత్త పాయింట్ ఉంది. నిజాయతీగా చెప్పాలంటే ఏ హీరో అటెంప్ట్ కూడా చేయడు. వందల మంది సినిమా చూశారు. అందరికీ నచ్చింది. అర్జున్ ఎ, అర్జున్ బి… సినిమాలో నా క్యారెక్టర్ రెండు షేడ్స్ లో ఉంటుంది. సినిమాలో ఒక్క స్లో మోషన్ షాట్ ఉండకూడదని, యాక్షన్ అంతా రియల్ గా ఉండాలని ఫారిన్ స్టంట్ మాస్టర్లతో చేశాం. ఇంతకు ముందు తెలుగులో ఎవరూ చేయని సినిమా 'హంట్'.ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్. యాక్షన్ కంటే ఎమోషనల్ సీన్స్ సినిమాను ఎక్కువ నిలబెడతాయి. సినిమా చూశాక స్పాయిలర్స్ ఇవ్వొద్దు. ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తే విన్నింగ్ ఛాన్సులు ఎక్కువని నా ఫీలింగ్. ఈ కథ విన్నప్పుడు షాకింగ్ ఎలిమెంట్ ఉంది అని అన్నారు.
భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ ''ఈ నెల 26న మా సంస్థలో నిర్మించిన 'హంట్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. ఇంగ్లీష్ టైటిల్ తో వస్తున్న తెలుగు చిత్రమిది. మా ఆప్తులు శ్రీకాంత్ తో తొలిసారి అసోసియేట్ కావడం ఆనందంగా ఉంది. అలాగే, భరత్ తో కూడా! ఇక, సుధీర్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా'' అని అన్నారు.
సీనియర్ హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ''దర్శకుడు మహేష్ వచ్చి రెండు గంటలు కథ చెప్పినప్పుడు వెంటనే సినిమా చేస్తానని చెప్పాను. అనుకున్న దాని కంటే ఈ సినిమా బాగా వచ్చింది. దర్శకుడు మహేష్ క్లారిటీతో తీశాడు. సినిమాలో నాది పాజిటివ్ క్యారెక్టరా? నెగిటివ్ క్యారెక్టరా? అనేది సస్పెన్స్. నేను 'హంట్' చూశా. పెద్ద హిట్ అవుతుంది. సుధీర్ బాబు అద్భుతంగా నటించారు. రెండు క్యారెక్టర్లలో బాగా చేశాడు. అర్జున్ ఎ, అర్జున్ బి మధ్య వేరియేషన్ తీసుకు రావడం ఈజీ కాదు. అతనికి అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ అన్నారు.
'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ మాట్లాడుతూ ''సినిమా చూసిన తర్వాత నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో నేనూ ఓ భాగం కావడం నాకు సంతోషంగా ఉంది. తెలుగులో నా రీ లాంచ్ కు ఇదే సరైన సినిమా అనుకున్నాను అని అన్నారు.
'హంట్' దర్శకుడు మహేష్ మాట్లాడుతూ ''వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నేను ఆనంద ప్రసాద్, అన్నే రవి కి రుణపడి ఉన్నాను. వాళ్ళు నన్ను నమ్మకపోతే ఈ రోజు పని లేకుండా ఎక్కడో ఉండేవాడిని. నాకు వస్తున్న అభినందనలకు కారణం వాళ్ళిద్దరూ. ఇప్పుడు టీజర్, ట్రైలర్ చూసి ప్రేక్షకులు అప్రిషియేట్ చేస్తున్నారు. అందులో ఎక్కువ షేర్ మా హీరో సుధీర్ బాబుకు వెళుతుంది. శ్రీకాంత్ తో పని చేయడం ఒక గౌరవం. 'హంట్'లో నటించడానికి అంగీకరించిన భరత్ కి థాంక్స్. సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ చాలా బాగా వర్క్ చేశారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం సూపర్. వన్నీ సింగిల్ ఎజెండాలో వెళతాయి. మా సినిమాలో ఆ ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. '' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి, నటి మౌనికా రెడ్డి. నటుడు గోపరాజు రమణ పాల్గొన్నారు.