సినిమాలు ఏది తీస్తే దానికే ఇంత డబ్బు అని చెల్లించి రైట్స్ తీసుకోవడం వల్ల ఓటిటి కంపెనీలు తమ ఆడియన్స్ కోరుకునే కంటెంట్ ఇవ్వలేవు. అందుకే తమ కస్టమర్స్ ఇష్టాలకు అనుగుణంగా ఓటిటి కంపెనీలు ఒరిజినల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఇప్పటికే నార్త్‌లో పలు వెబ్ సిరీస్‌లను అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థలు స్వయంగా నిర్మించి మంచి లాభాలు చూసాయి.
అదే విధంగా తెలుగులో కూడా ఒరిజినల్ కంటెంట్‌పై దృష్టి పెట్టాలని ఓటిటిలు పెద్ద ప్లాన్‌తోనే ముందుకెళుతున్నాయి. పేరున్న నటులు, ప్రముఖ దర్శకులను తీసుకుని భారీ బడ్జెట్‌తోనే వెబ్ సిరీస్‌లు, వెబ్ సినిమాలు పెద్ద సంఖ్యలో నిర్మాణం కానున్నాయి. హిందీకి వున్నంత వైడ్ రీచ్ రీజనల్ లాంగ్వేజ్ సిరీస్‌లకు వుండదు కనుక ఆ ఇబ్బందిని అధిగమించడానికి పాన్ సౌత్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఇవి రూపొందనున్నాయి.
ఇండిపెండెంట్ ఫిలింమేకర్స్‌కి ఇది శుభ పరిణామం. థియేటర్ల కోసం సినిమాలు చేస్తే నిర్మాతలు కమర్షియల్ కోణంలో ఆలోచించమంటారు. ఓటిటిల విషయంలో ఫిలింమేకర్స్‌కి అలాంటి నిబంధనలు వుండవు. కథకు ఏది అవసరమయితే అది ఎలాంటి భయం, బెరుకు లేకుండా చేసుకోవచ్చు. రానున్న కాలంలో తెలుగు విజువల్ ఎంటర్టైన్మెంట్ రూపురేఖలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.