ప్రభాస్ నుంచి రాబోయే సినిమా ఆదిపురుష్. కానీ ఈ సినిమాపై అతడి ఫ్యాన్స్ చూపు లేదు. ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమాపై వాళ్ల కన్ను ఉంది. ఎందుకంటే, ఆదిపురుష్ ఎలా ఉంటుందనేది వాళ్లకు తెలుసు. అదొక ఇతిహాసం, అందులో ప్రభాస్ రాముడు. ఇలాంటి భక్తిరస సినిమా నుంచి ఫ్యాన్ మూమెంట్స్ ఆశించడం అత్యాశ అవుతుందని అభిమానులకు తెలుసు.
కానీ సలార్ సినిమా అలాంటిది కాదు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా. పక్కా మాస్ యాక్షన్ మూవీ. అందుకే దీని కోసం రెబల్ ఫ్యాన్స్ వెయిటింగ్. అయితే ఎప్పుడైతే ఆదిపురుష్ వాయిదాపడి, జూన్ కు షిఫ్ట్ అయిందో.. అప్పట్నుంచి సలార్ పై కూడా అనుమానాలు మొదలయ్యాయి.
ఆదిపురుష్ వాయిదా పడింది కాబట్టి, షార్ట్ గ్యాప్ లో సలార్ వచ్చే అవకాశం లేదంటూ కొన్ని కథనాలొచ్చాయి. ఎట్టకేలకు వీటిపై క్లారిటీ వచ్చింది.
సలార్ సినిమాకు సంబంధించి విడుదల తేదీని మరోసారి కన్ ఫర్మ్ చేశారు మేకర్స్. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 28న సలార్ సినిమా థియేటర్లలోకి వస్తుందన్నారు. ఈ మేరకు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. #SalaarEuphoriaIn250Days అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.
ఎప్పుడైతే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ అయిందో, ప్రభాస్ ఫ్యాన్స్ మనసుల్లో ఉన్న అనుమానాలు, భయాలు పటాపంచలయ్యాయి. తాజా ప్రకటనతో ఈ ఏడాది ప్రభాస్ నుంచి 2 సినిమాలు రావడం గ్యారెంటీ అని తేలిపోయింది. ఆఖరి నిమిషంలో అడ్డంకులు ఎదురైతే తప్ప, ఆదిపురుష్-సలార్ సినిమాలు ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి రావడం పక్కా.