తమ తమ హీరోల గురించి కాస్త ఎక్కవగా ప్రచారం చేసుకోవాలని పీఆర్ టీమ్ లకు వుంటుంది. అందులో తప్పు లేదు. కానీ మరీ లైన్ దాటి ప్రచారం చేస్తే అది నగుబాటు అవుతుంది.
టాలీవుడ్ లో ఒక హీరో గురించి ఇలాంటి వార్తనే ప్రచారంలోకి తెచ్చారు. రెమ్యూనిరేష్ ఏకంగా 45 కోట్లు అంటూ. నాన్ థియేటర్ రైట్స్ మొత్తం హీరోకే ఇచ్చేస్తున్నారంటూ. ఈ వార్తలు తెలిసి టాలీవుడ్ జనాలు నవ్వుకుంటున్నారు.
ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రేంజ్ లో వున్న హీరోకి 45 కోట్లు ఇచ్చే నిర్మాతలు ఎవ్వరా? అని అటు ఇటు చూస్తున్నారు. ఇప్పటికే అదే హీరోతో ప్లానింగ్ లో సినిమా వున్న నిర్మాతలు కూడ ఇంకా ఎనిమిది కోట్ల దగ్గర బేరాలు ఆడుతున్నారు. అలాంటిది 45 కోట్లు అంటే ఏమనుకోవాలి అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
అసలు ఈ వార్త ఎలా వచ్చి వుంటుందా? అంటే సదరు హీరో పీఆర్ టీమ్ స్వంత ఇంట్రస్ట్ తో చేసిన పని అంటూ సమాచారం అందుతోంది. ‘’..సరే, ఈ ఉత్సాహం బాగానే వుంది..నిజంగా తనకు అంత మార్కెట్ వుంది అని హీరో భావిస్తే, నిర్మాతలకు అనవసరం తలకాయనొప్పి కదా అని టాలీవుడ్ జనాలు కామెంట్ చేస్తున్నారు..’’