భాగ్యనగర వీధుల్లో సోషల్ మీడియా

కమెడియన్ శ్రీనివాసరెడ్డి కొత్త అవతారం ఎత్తాడు. దర్శకుడిగా మారి భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే సినిమా తీశాడు. టైటిల్ కు తగ్గట్టు సినిమా కూడా గమ్మత్తుగా ఉంటుందని, రసగుల్లా లాంటి సినిమా అని ఊరించాడు.…

కమెడియన్ శ్రీనివాసరెడ్డి కొత్త అవతారం ఎత్తాడు. దర్శకుడిగా మారి భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే సినిమా తీశాడు. టైటిల్ కు తగ్గట్టు సినిమా కూడా గమ్మత్తుగా ఉంటుందని, రసగుల్లా లాంటి సినిమా అని ఊరించాడు. కానీ ప్రారంభంలోనే తప్పటడుగు వేశాడు. అవును.. ప్రచారంలో భాగంగా విడుదలైన ట్రయిలర్ ఆశించిన స్థాయిలో కామెడీని పండించలేకపోయింది.

సినిమాలో దాదాపు హాస్యనటులంతా ఉన్నారు. కాబట్టి టన్నుల కొద్దీ కామెడీ పండుతుందని అనుకున్నారు జనాలు. బహుశా సినిమాలో ఆ రేంజ్ కామెడీ ఉందేమో. ట్రయిలర్ లో మాత్రం అది కనిపించలేదు. మరీ ముఖ్యంగా ఈ కామెడీ పూర్తిగా సోషల్ మీడియాకు, ప్రస్తుత రాజకీయాలకు ముడిపడి ఉంది. ఇది ఏ మేరకు సి-సెంటర్ ప్రేక్షకుడ్ని ఎట్రాక్ట్ చేస్తుందనేది సందేహం.

ఫ్లయింగ్ కలర్స్ అనే బ్యానర్ పై నిర్మాతగా కూడా పరిచయమౌతున్న శ్రీనివాసరెడ్డి.. దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా చాలా పెద్ద బరువే మోశాడు. ఇంతకుముందు సోలోగా శ్రీనివాసరెడ్డి చేసిన సినిమాలేవీ ఆడలేదు. ఈసారి మరింత హెవీ వెయిట్ తో ఈ నటుడు ఏమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

హీరో వరుణ్ తేజ్ ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ చేశాడు. దిల్ రాజు ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది ఈ మూవీ.