దర్శకుడు ఆర్జీవీ తన తాజా సంచలన చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' కు రెండో ట్రయిలర్ వదిలారు. తొలి ట్రయిలర్ వదిలారు. పాటలు వదిలారు. చాలా హడావుడి చేసారు. అదంతా చాలదన్నట్లు ఇప్పడు రెండో ట్రయిలర్ వదిలారు.
సినిమా విడుదల మరో వారం రోజుల్లో వుండగా ఇప్పుడు ఈ ట్రయిలర్ వదలడం ఎందుకో? ఎందుకంటే సినిమా కంటెంట్ ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు రీచ్ కావాలో, ఆ మేరకు రీచ్ అయిపోయింది.
ట్విట్టర్ లో, యూ ట్యూబ్ లో ఎంజాయ్ చేసే వాళ్లు చేస్తున్నారు. కామెంట్ లు, లైకులు, తిట్లు, దీవెనలు కుప్పలు తెప్పలుగా పడిపోతున్నాయి. అయితే ఇంకా ఇప్పుడెందుకీ రెండో ట్రయిలర్ అన్నది అనుమానం. కేవలం సినిమా ద్వారానే కాదు, సోషల్ నెట్ వర్క్ కంటెంట్ ద్వారా కూడా తెలుగుదేశం పార్టీని పూర్తిగా టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
సినిమా మార్కెట్ మెల్ల మెల్లగా ఫినిష్ చేస్తున్నాను. నైజాం ఓన్ రిలీజ్. సీడెడ్ కొటిన్నర ఎంజీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. వెస్ట్ మినహా ఆంధ్రలోని మిగిలిన ఏరియాలు దాదాపు ఫైనల్ అయ్యాయి. ఆంధ్ర ఏరియాను మూడు కోట్ల రేషియోలో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ సమస్య ఒక్కటే. సెన్సారు. రెండురోజుల్లో సెన్సారు వుంది. ఏం అభ్యంతరాలు వస్తాయో చూడాలి. కేవలం టైటిల్ అభ్యంతరం అంటే మార్చేయడానికి ఆర్జీవీ టీమ్ రెడీగా వుంది. అందుకోసం చాలా టైటిళ్లు ఆలోచించి రెడీగా పెట్టారని తెలుస్తోంది.
'పప్పులాంటి అబ్బాయి' అని లేదా ఇందుకు దగ్గరగా వుండే టైటిళ్లు రెండు మూడు ఆలోచించి రెడీగా వుంచుకున్నట్లు తెలుస్తోంది.