ఎమ్మెల్యే దంప‌తుల‌పై లైంగిక వేధింపుల కేసు

ఎట్ట‌కేల‌కు బాధితురాలి పోరాటం కొంత వ‌ర‌కు ఫ‌లితం ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న భార్య‌పై కూడా లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించింది. ఈ సంఘ‌ట‌న ఉత్త‌రాఖాండ్‌లో చోటు చేసుకొంది. …

ఎట్ట‌కేల‌కు బాధితురాలి పోరాటం కొంత వ‌ర‌కు ఫ‌లితం ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న భార్య‌పై కూడా లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించింది. ఈ సంఘ‌ట‌న ఉత్త‌రాఖాండ్‌లో చోటు చేసుకొంది. 

బీజేపీ ఎమ్మెల్యే మ‌హేశ్‌నేగి, ఆయ‌న భార్య‌పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేయాల‌ని డెహ్రాడూన్ అద‌న‌పు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆదేశించింది. అంతేకాదు, వెంట‌నే ద‌ర్యాప్తు ప్రారంభించాల‌ని పోలీసుల‌ను కోర్టు ఆదేశించ‌డం ఆ రాష్ట్రంలో తీవ్ర సంచ‌ల‌నమైంది.

ఎమ్మెల్యేకు త‌నతో రెండేళ్లుగా శారీరక సంబంధం ఉంద‌ని, త‌న కుమార్తె డీఎన్ఏ త‌న భ‌ర్త‌ డీఎన్ఏతో స‌రిపోల‌డం లేద‌ని, ఎమ్మెల్యే డీఎన్ఏను ప‌రీక్షించాల‌ని, అది సూట్ అవుతుంద‌ని ఆమె డిమాండ్ చేశారు. అలాగే త‌న‌తో ఎమ్మెల్యేకు సంబంధాలున్నాయ‌ని నిరూపించే వీడియోను ఆ మ‌ధ్య ఆమె విడుద‌ల చేసింది.

కాగా త‌న భ‌ర్త నేరాన్ని దాచాల‌ని ఎమ్మెల్య‌ భార్య డ‌బ్బు ఇచ్చింద‌ని బాధితురాలి త‌ర‌పు న్యాయ‌వాది ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో బాధితురాలి ఆవేద‌న విన్న న్యాయ‌స్థానం…ఎమ్మెల్యేతో పాటు ఆయ‌న భార్య‌పై కూడా కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. ఎమ్మెల్యేపై లైంగిక ఆరోప‌ణ‌లు ఉత్త‌రాఖాండ్‌లో తీవ్ర రాజ‌కీయ దుమారం రేపుతోంది. దీన్ని ఆ రాష్ట్ర బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి ఉంది.

సినిమా రివ్యూ: వి

తెలుగు మాట్లాడ్డ‌మే రాని లోకేశ్  కాల‌మిస్ట్ అవ‌తారం ఎత్తారు