రాశిఫలాలు…06.09.20 నుంచి 12.09.20 వరకు

మేషం: అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. ఆర్థికం….రావలసిన డబ్బు చేతికందుతుంది. రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. స్థిరాస్తి కొనుగోలుపై డబ్బు వెచ్చిస్తారు. కుటుంబం.. అందరిపైనా మీ…

మేషం: అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. ఆర్థికం….రావలసిన డబ్బు చేతికందుతుంది. రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. స్థిరాస్తి కొనుగోలుపై డబ్బు వెచ్చిస్తారు. కుటుంబం.. అందరిపైనా మీ ప్రేమను చాటుకుంటారు. పెద్దల సలహాలు పాటిస్తారు. శుభకార్యాలపై చర్చలు సఫలం. సోదరులతో విభేదాలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం….కొంత మెరుగుదల కనిపిస్తుంది. వైద్యసేవలకు స్వస్తి చెబుతారు. వ్యాపారాలు.. అనుకున్న విధంగా విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అంది మరింతగా లాభాలు పొందుతారు. ఉద్యోగాలు….కోరుకున్న మార్పులు ఉండవచ్చు. ఉన్నతాధికారులు మీ ప్రతిభను గుర్తించే సమయం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు నెమ్మదిగా లభిస్తాయి. మహిళలకు మనశ్శాంతి చేకూరే సమయం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.

వృషభం: ఏ పని చేపట్టినా ముందుకు సాగక డీలాపడతారు. అయితే అతికష్టంపై కొన్ని పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి సైతం విమర్శలు ఎదురవుతాయి. ఆర్థికం…రావలసిన సొమ్ము అందడంలో జాప్యం జరిగి రుణాలు చేస్తారు. కొత్త అప్పుల కోసం యత్నిస్తారు. ఆస్తుల విక్రయాలలో ఆటంకాలు. కుటుంబం…బంధువులతో అకారణంగా విభేదిస్తారు. మీ మాట విస్మరించినందుకు సంతానంపై అలక వహిస్తారు. కొన్ని శుభకార్యాలను సైతం వాయిదా వేస్తారు. ఆరోగ్యం…ఆరోగ్యం మందగించి వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలు…ఆశించిన లాభాలు అంతగా కనిపించవు. పెట్టుబడుల్లో నిదానం పాటించాలి. ఉద్యోగాలు….కోరుకున్న మార్పులు చివరిలో నిలిచిపోవచ్చు. పనిభారంతో కొంత ఇబ్బంది పడతారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. మహిళలకు చికాకులు తప్పవు. శివాష్టకం పఠించండి.

మిథునం: చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికం…డబ్బుకు ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. రుణబాధలు తీరతాయి. ఆస్తుల క్రయవిక్రయాలు సకాలంలో పూర్తి చేసి అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. కుటుంబం…మీ పనితనం, నైపుణ్యం చూసి కుటుంబసభ్యులు ఆనందిస్తారు.  ఆరోగ్యం…స్వల్ప రుగ్మతలు బాధించినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు…..లాభాలు దక్కి ఉత్సాహంగా సాగుతారు. విస్తరణ కార్యక్రమాలను ఎట్టేకలకు పూర్తి చేస్తారు. భవిష్యత్తు అవసరాలను గుర్తించి తదనుగుణంగా వ్యూహాలు అమలు చేస్తారు. ఉద్యోగాలు….కొత్త ెదాలు దక్కుతాయి. మీపై ఉంచిన బాధ్యతలు పైస్థాయి వారు కొంత తగ్గించే వీలుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పూర్వవైభవం లభిస్తుంది. మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది. శ్రీకాలభైరవాష్టకం పఠించండి.

కర్కాటకం: పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆర్థికం….ఊహించని రీతిలో సొమ్ము సమకూరుతుంది. అప్పులు తీరి ఊరట చెందుతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. కుటుంబం.. అందరితోనూ సఖ్యతగా మసలుకుంటారు. సోదరులతో విభేదాలు తొలగుతాయి. భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది. సంతానం నుంచి ఒక కీలక సమాచారం రావచ్చు. ఆరోగ్యం….మరింత మెరుగుదల కనిపిస్తుంది. ఔషధసేవనం తగ్గిస్తారు. వ్యాపారాలు….క్రమేపీ లాభాలు గడిస్తారు. నూతన పెట్టుబడులు అంది విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలు….బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కొంత ఊరట లభించే సమయం. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

సింహం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మరపురాని సంఘటన ఎదురవుతుంది. ఇది మీ మార్పునకు దోహదపడే వీలుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఆర్థికం….ఊహించని రీతిలో సొమ్ము అందుతుంది. రుణదాతల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. భూములు విక్రయాలు పూర్తి చేసి కొంత సొమ్ము సమకూర్చుకుంటారు. వ్యాపారాలు…లాభాలు అనూహ్యంగా దక్కుతాయి. భాగస్వాములు పెట్టుబడులు సమకూరుస్తారు. ఉద్యోగాలు….కొన్ని మార్పులు జరుగుతాయి. ఉన్నతాధికారుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తి లేదా ధనలాభ సూచనలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కన్య: ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. ఆర్థికం….ఆశించిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. రుణాలు సైతం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆస్తుల విక్రయాలు పూర్తి చేసినా సకాలంలో డబ్బు అందదు. కుటుంబం….మీరు ఏ మాట చెప్పినా కుటుంబసభ్యులు పట్టించుకోక పోవడంతో మనస్తాపం కలిగిస్తుంది. నిర్ణయాలు కొన్ని మార్పుచుకుంటారు. ఆరోగ్యం….స్వల్ప అనారోగ్య సూచనలు. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలు.. కొంత మేర లాభిస్తాయి. అయినా సంతప్తికరంగా ఉండవు. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాలు…మార్పులకు సిద్ధం కావాలి. మీపై అధికారులు ఒత్తిడులు పెంచుతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కొద్దిపాటి చికాకులు, సమస్యలు ఎదురవుకావచ్చు. మహిళలకు ఒడిదుడుకులు తప్పవు. ఆదిత్య హదయం పఠించండి.

తుల: ముఖ్యమైన కార్యక్రమాలు నిదానిస్తాయి. ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగక డీలాపడతారు. ఆర్థికం….కొంత సొమ్ము అందినా అవసరాలు తీరక అప్పులు చేస్తారు. మరోవైపు ఖర్చులు పెరిగి ఎటూ పాలుపోని స్థితి ఉంటుంది. కుటుంబం…అందరితోనూ విభేదిస్తారు. మీపై బంధువులు అభాండాలు మోపవచ్చు. ఆత్మస్క్థెర్యంతో ముందుకు సాగడం మంచిది. అన్నింటా మౌనం మంచిది. కొన్ని వేడుకలు చివరిలో వాయిదా వేస్తారు. ఆరోగ్యం….ప్రత్యేక శ్రద్ధ వహించండి. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలు….క్రమేపీ కొంత లాభిస్తాయి. పెట్టుబడులు ఆలస్యమవుతాయి. విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు. ఉద్యోగాలు….కొన్ని మార్పులు జరిగే అవకాశం, పనిఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొంత ఊరట లభిస్తుంది. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వశ్చికం: కొత్త పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్యమైన అంశాలపై గీె ర్చిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థికం…డబ్బుకు లోటు ఉండదు. ఏదో విధంగా ధనప్రాప్తి కలుగుతుంది. అప్పులు తీరి ఊరట చెందుతారు. కుటుంబం… అందరితోనూ సంతోషంగా గడుపుతారు. మీ యత్నాలకు కుటుంబసభ్యులు సహకరిస్తారు. వివాహాది వేడుకల ఏర్పాట్లపై పెద్దల సూచనలు పాటిస్తారు. ఆరోగ్యం.. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్యసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు….అనుకున్న మేరకు లాభాలు అందుతాయి. విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలు….విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పైఅధికారుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆలోచనలు అమలులో ముందడుగు వేస్తారు. ఆర్థికం…సొమ్ములకు ఇబ్బందిలేని విధంగా గడిచిపోతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. షేర్ల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి అదనపు ఆదాయం దక్కించుకుంటారు. కుటుంబం….అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఒకరి ఆరోగ్యం కుదుటపడి కొంత ఊపిరిపీల్చుకుంటారు. ఆరోగ్యం…కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి. వ్యాపారాలు….అనుకున్న లాభాలు అందుతాయి. భాగస్వాములతో విభేదాలు పరిష్కరించుకుని ఒప్పందాలు చేసుకుంటారు. విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలు….విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. ఉన్నత పోస్టులు ఎట్టేకలకు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మకరం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు.  ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆర్థికం.. అనుకోని ఖర్చులు మీదపడి ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఇతరులకు ఇచ్చిన రుణ హామీలను సైతం మీరే భరించాల్సిన పరిస్థితి. కుటుంబం….సమస్యలు కొన్ని ఇబ్బందికరంగా మారతాయి. సోదరులతో కలహాలు నెలకొంటాయి. వివాహాది వేడుకలు రద్దు చేసుకుంటారు. బంధువులు మీపై కొన్ని నెపాలు మోపుతారు. ఆరోగ్యం…..చర్మసంబంధిత రుగ్మతలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు….లాభాలు ఆశించినంతగా కనిపించవు. పెట్టుబడులలో తొందరపాటు వద్దు. భాగస్వాముల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలు….అదనపు పనిభారంతో సతమతమవుతారు. పైస్థాయి వారితో మాటపడతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు గందరగోళంగా ఉంటుంది. కోర్టు వివాదాలు తప్పకపోవచ్చు. మహిళలకు మానసిక అశాంతి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం: ఏ కార్యక్రమం చేపట్టినా నిదానంగా సాగుతాయి. ఆర్థికం….రావలసిన డబ్బు అందడంలో ఆలస్యం. తద్వారా రుణాలు చేస్తారు. షేర్ల విక్రయాలలో ప్రతిష్ఠంభన చికాకు పరుస్తాయి. కుటుంబం….బంధువులతో అకారణంగా విరోధాలు. సోదరుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. శుభకార్యాల ప్రస్తావనలో ఆటంకాలు. ఆరోగ్యం…స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. వైద్యసలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు… అతి సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులలో మరింత జాగ్రత్తగా చూసుకోండి. భాగస్వాములు మీపట్ల కొన్ని అనుమానాలు వ్యక్తం చేసే వీలుంది. ఉద్యోగాలు….అనుకోని మార్పులు సంభవం. పనిభారంతో సతమతమవుతారు.  పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పర్యటనలు వాయిదా. మహిళలకు మానసిక ఆందోళన. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం: కొన్ని కార్యక్రమాలను శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికం…కొంత సొమ్ము అందినా అవసరాలకు సరిపడక ఇబ్బంది పడతారు. కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. భూముల విక్రయాలు నిలిచిపోవడంతో డబ్బు అందక నిరాశ చెందుతారు. కుటుంబం….కుటుంబసమస్యలు కొంత పరిష్కరించుకుంటారు. పెద్దల సలహాల మేరకు నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం…కొంత అనారోగ్య సూచనలు. వ్యాపారాలు…స్వల్ప లాభాలు అందుకుంటారు. నూతన పెట్టుబడులు అందినట్లే అనిపించి చేజారవచ్చు. ఉద్యోగాలు…అనుకోని మార్పులు ఉండవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడులు. రాజకీయవేత్తలు, కళాకారులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు అంచనాలు తారుమారు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Vakkantham Chandra Mouli 
www.janmakundali.com