గ్యాప్ వదలని సుధీర్ బాబు

ఈ నెలాఖరుకు కొన్ని క్రేజీ ప్రాజెక్టులొస్తున్నాయి. ఇక దసరా బరిలో పోటీ గురించి అందరికీ తెలిసిందే. మరి ఓ మోస్తరు సినిమాలు ఎప్పుడు రావాలి? దీనికో పరిష్కారం కనిబెట్టాడు హీరో సుధీర్ బాబు. తన…

ఈ నెలాఖరుకు కొన్ని క్రేజీ ప్రాజెక్టులొస్తున్నాయి. ఇక దసరా బరిలో పోటీ గురించి అందరికీ తెలిసిందే. మరి ఓ మోస్తరు సినిమాలు ఎప్పుడు రావాలి? దీనికో పరిష్కారం కనిబెట్టాడు హీరో సుధీర్ బాబు. తన సినిమాను ఈ నెలాఖరు సినిమాల తర్వాత, దసరా సినిమాలకు కాస్త ముందు షెడ్యూల్ చేసి పెట్టుకున్నాడు. ఎందుకైనా మంచిదని ఇప్పట్నుంచే డేట్ కూడా ప్రకటించాడు.

సుధీర్ బాబు తాజా చిత్రం మామా మశ్చీంద్ర. నటుడు-దర్శకుడు హర్షవర్థన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను అక్టోబర్ 6న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విడుదల తేదీతో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

'మామా మశ్చీంద్ర' సినిమాలో 3 పాత్రల్లో కనిపించబోతున్నాడు సుధీర్ బాబు. ఇందులో దుర్గ (స్థూలకాయుడు), పరశురాం (ఓల్డ్ డాన్), డిజె.. ఇలా 3 భిన్నమైన పాత్రలలో అలరించబోతున్నాడు. రిలీజ్ డేట్ పోస్టర్ లో మరోసారి ఈ 3 గెటప్స్ ను పరిచయం చేశారు మేకర్స్.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాళిని రవి, ఇషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. ఇప్పటికే టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే.