విశాఖ అంటే గ్రేట్ సిటీ. టూరిజానికి గమ్యస్థానం. ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి విశాఖ గురించి ఈ మధ్యనే రకరకాల కధనాలు భయాలు వ్యాప్తి చెందుతున్నాయి. విశాఖకు సునామీ ముప్పు ఉందని కూడా వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే తాజాగా మూడు రెండు రోజుల క్రితం విశాఖలో స్వల్ప భూకంపం వచ్చింది. దాంతో జనాలు జడుసుకున్నారు. విశాఖ సేఫేస్ట్ సిటీ కాదా అని ఆందోళన చెందారు.
అయితే దీని మీద నిపుణులు ఏమంటున్నారంటే విశాఖ భూకంపాలకు జోన్ కానే కాదని. అత్యంత స్వల్పంగానే భూకంపాల తీవ్రత ఉంటుందని కూడా తేల్చేశారు. అదే విధంగా విశాఖ భూకంపాలకు సంబంధించి జోన్ టూ లో ఉందని పేర్కొంటున్నారు. అంటే చాలా తక్కువగా తాకిడి ఉంటుందిట.
ఇక గత రెండు వందల ఏళ్లలో విశాఖ సిటీ గురించి ఆలోచిస్తే కేవలం ఏడంటే ఏడు సార్లు మాత్రమే విశాఖలో భూకంపాలు వచ్చినట్లుగా రికార్డులు చెబుతున్నాయి వెల్లడించారు.
ఇందులో కూడా అత్యధికంగా రికటర్ స్కేల్ మీద నమోదు అయింది. 4.3గా వివరిస్తున్నారు. ఇక లేటెస్త్ గా వచ్చిన స్వల్ప భూకంపం తీవ్రత 1.8గా నమోదు అయింది. ఇదే రెండు వందల ఏళ్లలో అత్యల్పమని కూదా పేర్కొంటున్నారు.
మొత్తానికి నిపుణులు నిర్దారించేది ఏంటంటే విశాఖ సేఫ్ జోన్ లో ఉందని, భూకంపాలు సునామీలు లాంటివి రానే రావు. వచ్చినా అతి స్వల్పంగానే ప్రభావం ఉంటుందని, సో విశాఖ ఇపుడు హాపీయెస్ట్ జోన్ లో ఉందనే అనుకోవాలి.