తమన్ ను బాధపెట్టిన టక్ జగదీశ్

తనపై వచ్చే రూమర్లను అస్సలు పట్టించుకోనంటున్నాడు తమన్. అయితే తన కెరీర్ లో జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలు మాత్రం తనను ఇబ్బంది పెట్టాయన్నాడు. రీసెంట్ గా జరిగిన అలాంటి బాధాకరమైన ఘటనను బయటపెట్టాడు.…

తనపై వచ్చే రూమర్లను అస్సలు పట్టించుకోనంటున్నాడు తమన్. అయితే తన కెరీర్ లో జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలు మాత్రం తనను ఇబ్బంది పెట్టాయన్నాడు. రీసెంట్ గా జరిగిన అలాంటి బాధాకరమైన ఘటనను బయటపెట్టాడు. టక్ జగదీశ్ సినిమా నుంచి తప్పుకోవడం తనను బాధించిందన్నాడు ఈ సంగీత దర్శకుడు.

“టక్ జగదీశ్ విషయంలో చాలా బాధపడ్డాను. ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తం పూర్తిచేశాను. కానీ నానికి నచ్చలేదు. నా లైఫ్ లో అలా జరగడం ఫస్ట్ టైమ్. నానితో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. మనసు పెట్టి పనిచేశాను. సినిమా మొత్తానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తిచేశాను. కానీ నానికి నచ్చలేదు. ఇంకా బెటర్ గా కోరుకున్నాడు. తర్వాత గోపీసుందర్ తో చేయించుకున్నారు. ఆ సినిమా విషయంలో ఎక్కడ మిస్-ఫైర్ అయిందో అర్థంకాలేదు.”

భవిష్యత్తులో నాని సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానంటున్నాడు తమన్. టక్ జగదీశ్ మేటర్ ను వెంటనే మరిచిపోయానని, నానితో కలిసి వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని అన్నాడు. పవన్ హీరోగా నటించిన భీమ్లానాయక్ పాటలపై స్పందిస్తూ.. చాలా తొందరగా ఆ పాటలు పూర్తయ్యాయని బయటపెట్టాడు.

“భీమ్లా నాయక్ టైటిల్ పెట్టిన వెంటనే చాలా ఐడియాస్ వచ్చాయి. టైటిల్ పెట్టిన 3 రోజులకే టైటిల్ సాంగ్ ఫినిష్ చేశాను. ఆ తర్వాత 4 రోజుల్లో 4 సాంగ్స్ పూర్తిచేశాం. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంటే, ఆ లొకేషన్ లో ఉన్న కారవాన్ లోనే అన్ని పాటలు పూర్తయిపోయాయి. నా కెరీర్ లో చాలా ఫాస్ట్ గా పాటలు కంపోజ్ చేసింది భీమ్లా నాయక్ సినిమాకే.”

అఖండ సినిమాపై స్పందించిన తమన్.. ఆ సినిమా ప్రభావం తనపై రెండున్నర నెలలు ఉందన్నాడు. అఖండ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తన కెరీర్ బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా నిలిచిపోతుందన్నాడు.