సమంత వివాహ బంధం విచ్ఛిన్నం తర్వాత ఆమె కదలికలపై మరింత అటెన్షన్ పెరిగింది. ఆమె ఏం మాట్లాడినా, మాట్లాడకపోయినా హాట్ టాపిక్ కావడం గమనార్హం. సమంత చేసే ప్రతి కామెంట్ వెనుక ఉద్దేశాలు, దురుద్దేశాల గురించి లోతుగా పరిశీలన చేస్తున్నారు. నాగచైతన్యతో విడిపోవడం కెరీర్‌పై ఏ మాత్రం ప్రభావం పడకుండా ఆమె జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సమంత ట్వీట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే పోస్టుల్లో ఫిలాసఫీ కనిపిస్తోంది. విడాకుల తర్వాత ‘అమ్మ చెప్పింది’ పేరుతో సోషల్ మీడియా వేదికగా తనవైన అభిప్రాయాల్ని సూటిగా, స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఆడపిల్ల అంటే కేవలం పెళ్లి దృష్టితో చూడొద్దని ఆమె చెప్పిన నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా’ అనే అర్థం ధ్వనించేలా తాజాగా ఇన్‌స్టా స్టోరీలో సమంత చేసిన వ్యాఖ్య వైరల్ అవుతోంది. అదేంటో ఆమె మాటల్లోనే…
‘మన ముందు బల ప్రదర్శన చూపించేవాళ్లు మెంటల్‌గా ఎప్పటికీ స్ట్రాంగ్ కాలేరు. తెలియని యుద్ధాలను అధిగమించేవారే నిజమైన బలవంతులు’ అని సమంత పేర్కొన్నారు. సమంత తాజా పోస్టుపై నెటిజన్లు తమకిష్టమైన రీతిలో విశ్లేషిస్తున్నారు.
తెలియని యుద్ధాలు అంటే జీవితంలో ఊహించని విధంగా ఎదురయ్యే కష్టనష్టాలకు వెరవకుండా ఎదురొడ్డి పోరాడే వాళ్లే నిజమైన బలవంతులనేది సమంత ఉద్దేశంగా కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే పైకి బలప్రదర్శన చేసే వాళ్లూ ఎప్పటికీ మానసికంగా బలవంతులు కాలేరని సమంత చెప్పడం వెనక లోతును అర్థం చేసుకోవాలని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా సమంత మాటలకు అర్థాలే వేరా అని మరికొందరి అభిప్రాయం.