సాధారణంగా పెళ్లి తర్వాత మహిళా నటులు సినిమాలకు గుడ్‌బై చెబుతుంటారు. పెళ్లి తర్వాత కూడా మరీ ముఖ్యంగా హీరోయిన్లు చిత్ర పరిశ్రమలో రాణించాలంటే జీవిత భాగస్వామి ప్రోత్సాహం అవసరం.
లైఫ్ పార్టనర్ అభిప్రాయాలకు విరుద్ధంగా ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఇంట్లోనే పోరాటం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో విడిపోవడానికి దారి తీసిన ఉదంతాలు అనేకం.
ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లును తీసుకురావాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. గత ఏడాది గౌతమ్ కిచ్లును ఆమె పెళ్లాడారు. అప్పటి నుంచి తన భర్తకు ఇండస్ట్రీలో చిన్న రోల్ అయినా ఇప్పించుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
కనీసం తాను నటించే చిత్రాల్లోనైనా అవకాశం ఇవ్వాలని నిర్మాతలు, దర్శకులను ఆమె అడుగుతున్నారని సమాచారం. పాత్ర చిన్నదా, పెద్దదా అనే దానితో సంబంధం లేకుండా తెరపై కనిపించేలా అవకాశం ఇస్తే చాలని ఆమె కోరుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ముందు తెరపై కనిపిస్తే… ఆ తర్వాత అవకాశాలు వాటికవే వస్తాయనే ధీమాతో కాజల్ తన ప్రయత్నాలను తీవ్రతరం చేసినట్టు తెలుస్తోంది.