విడుదలకు ముందే రూ.50 కోట్లు వసూళ్లు

రిలీజ్ తర్వాత 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే విడుదలకు ముందే 50 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? దీనికి లేటెస్ట్ సమాధానం జవాన్ సినిమా. షారూక్…

రిలీజ్ తర్వాత 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే విడుదలకు ముందే 50 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? దీనికి లేటెస్ట్ సమాధానం జవాన్ సినిమా. షారూక్ నటించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి వస్తోంది. అంతలోనే 50 కోట్లు కొల్లగొట్టింది.

అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో జవాన్ సినిమా కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమాకు 51 కోట్ల 17 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చింది. ఇదంతా పఠాన్ సినిమాతో వచ్చిన ఊపు.

వరుసగా ఫ్లాపులిచ్చిన షారూక్, పఠాన్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ సినిమా వరల్డ్ వైడ్ సూపర్ హిట్టయింది. దీంతో జవాన్ సినిమాపై అమాంతం క్రేజ్ పెరిగింది. రిలీజ్ కు ముందే 50 కోట్ల కలెక్షన్ రావడానికి ఇదే కారణం.

ఇండియాలో జవాన్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు 32 కోట్ల 47 లక్షల రూపాయలొచ్చాయి. మరో 60 లక్షల రూపాయలు యాడ్ అవ్వొచ్చని ట్రేడ్ భావిస్తోంది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 2.25 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఈ క్రమంలో పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను జవాన్ అధిగమించింది.

జవాన్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్సుల్లో 4,57,230 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ సంఖ్య మరో 40వేల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే మల్టీప్లెక్స్ టికెట్ సేల్స్ లో జవాన్ తన జోరు చూపించలేకపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో బాహుబలి-2 సినిమా 6లక్షల 50వేల అడ్వాన్స్ టికెట్స్ అమ్మకాలతో టాప్ లో నిలవగా.. రెండో స్థానంలో పఠాన్, మూడో స్థానంలో కేజీఎఫ్2 నిలిచాయి. ప్రస్తుతం జవాన్ నాలుగో స్థానంలో ఉంది.