జగన్ కు ఎపుడేం ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో బాగా తెలుసు అంటారు. ఆయన అందరికీ గుర్తు పెట్టుకుంటారు. తమకు పదవులు కావాలి ఎవరైనా అడిగినా ఆయన అర్హత, అవకాశాలు చూసి మరీ ఇస్తారని అంటారు.
ఇపుడు జగన్ ద్రుష్టిలో అలాంటి అర్హత సంపాదించిన ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ఆయనే విశాఖ జిల్లా గాజువాక నుంచి వైసీపీ జెండా ఎగరేసిన మొనగాడు. అంతే కాదు, ఆయన రీల్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ణి ఓడించి మరీ మంచి మెజారిటీతో ఎమ్మెల్యే సీటు కొట్టేశారు.
ఆయనకు మద్దతుగా గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ రీల్ హీరోకు, రియల్ హీరోకు మధ్యన పోటీ అంటూ నాడు సంచలన కామెంట్స్ చేశారు. చివరికి జనాలు రియల్ హీరో అయిన తిప్పల నాగిరెడ్డిని ఎన్నుకుని ఎమ్మెల్యేని చేశారు.
ఇపుడు ఆయనను ఈబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా జగన్ నియమిస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్ర స్థాయి పదవి అయిన ఈ చైర్మన్ గిరీతో నాగిరెడ్డి పొలిటికల్ గా మరో మెట్టు ఎక్కినట్లేనని భావిస్తున్నారు. పవన్ని ఓడించినందుకు నిజానికి మంత్రి పదవే నాగిరెడ్డికి ఇవ్వాలి.
కానీ సామాజిక సమీకరణలు సరిపోకపోవడంతో అది కుదరలేదు, అయినా ఇపుడు మినిస్టర్ సరిసాటిగా ఈ ప్రతిష్టాత్మకమైన కార్పోరేషన్ పదవిని నాగిరెడ్డికి జగన్ కట్టబెడుతున్నారు. ఎమ్మెల్యేగా స్ట్రాంగ్ పునాది వేసుకున్న నాగిరెడ్డికి మరోమారు గెలిచేందుకు ఈ పదవి పూర్తిగా అక్కరకు వస్తుందని అంటున్నారు.