నేడు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి. ఈ సందర్భంగా మనం గురుపూజోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తమతమ మేధోస్థాయిల్లో గురువుల గొప్పతనాన్ని చాటుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, పెడుతున్నారు.
ఇందులో భాగంగా కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన సామాజిక కార్యకర్త, జానపద కళాకారుడైన పల్లవోలు రమణ వినూత్నంగా, సృజనాత్మకంగా కొంత మంది గురువులకు శుభాకాంక్షలు చెప్పారు. ఫేస్‌బుక్ పేజీలో చేసిన ఆ పోస్టు బాగా వైరల్ అవుతోంది.
ఇంతకూ ఎవరెవరి గురువులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారో తెలుసుకుందాం.
జలీల్ ఖాన్ కు
చదువు చెప్పిన
టీచర్స్ కి
బాలయ్యకు
సంస్కారం నేర్పిన
గురువులకు
చంద్రబాబు గారి
ఇంగ్లీషు టీచర్స్ కు
లోకేష్ బాబు
తెలుగు టీచర్‌కు
రాహుల్ గాంధీ
సోషల్ టీచర్‌కు
మంచు లక్ష్మికి
తెలుగు నేర్పిన
గురువుకు
కృష్ణకు
రాజశేఖర్‌కు
డాన్స్ నేర్పించిన
గురువులకు
గురుపూజోత్సవ
శుభాకాంక్షలు..
కాగా ఈ పోస్టుపై ఒక మిత్రుడు కామెంట్ ఆలోచనాత్మకంగా ఉంది. మహమ్మూద్ అనే కవి, రచయిత స్పందిస్తూ…ప్రధాని మోడీకి ఆర్థిక పాఠాలు చెప్పిన టీచర్స్‌కి కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలపడం విశేషం. క్రియేటివిటీ ఒకరి సొత్తు కాదనేందుకు ఈ పోస్టే నిదర్శనం. హాస్యాన్ని, వ్యంగ్యాన్ని జోడించి తయారు చేసిన ఈ పోస్టు చదివితే మాత్రం నవ్వకుండా అసలు ఉండలేరు.
అంత మంది ప్రముఖుల గురువులకు సృజనాత్మకంగా శుభాకాంక్షలు చెప్పే తెలివి తేటలను నేర్పిన పల్లవోలు రమణ గురువులకు మనం విషెస్ చెబుదాం.