మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక తీరింది. రాధేశ్యామ్ సినిమా నుంచి తొలిపాట బయటకు వచ్చింది. ఈ లిరికల్ వీడియో చిత్రంగా వుంది.
సాధారణంగా లిరికల్ వీడియో అంటే కొన్ని ఫొటొలు, కొంత వీడియో ఫుటేజ్ కలిపి పిక్చరైజ్ చేస్తారు. కానీ ఇక్కడ టోటల్ పాటను సిజి వర్క్ చేసి, త్రీడీ ఏనిమేషన్ వీడియో గేమ్ మాదిరిగా వదిలారు.
సినిమా స్టోరీ ఎలా వుండబోతోందని ఇన్నాళ్లూ వినిపిస్తోందో, అదే విజువల్ గా చూపించారు. అమ్మాయి ట్రయిన్ లో ప్రయాణిస్తుండడం, హీరోకి ఆ రైలుకు ప్రమాదం జరుగుతుందని తెలిసి, పక్కనే కారులో వెళ్లి అమ్మాయిని తన కారులోకి తీసుకోవడం, రైలు ప్రమాదానికి గురికావడం అనే విదంగా పాటను చిత్రీకరించారు.
అయితే ఎక్కడా ఒరిజినల్ ఫుటేజ్ కొంచెం కూడా వాడలేదు. అంతా త్రీడీ యానిమేషన్ వర్క్ నే. ఇంకా గమ్మత్తేమిటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ప్రభాస్ బాగానే వున్నాడు కానీ పూజా హెగ్డే ను పూజా అని గుర్తు పట్టడం మాత్రం కొంచెం కష్టమే. కృష్ణకాంత్ రాసిన పాటను యువన్ శంకర్ రాజా, హరిణి ఆలపించారు. జతిన్ సంగీతం అందించారు.