ఇండస్ట్రీ చేతిలో వుంటే ఏమైనా నడుస్తుంది. ఏం చేసినా చెల్లుతుంది. దసరా టైమ్ లో ఉన్నట్లుండి వరుడుకావలెను సినిమా మీదకు వచ్చి పడింది బ్యాచులర్ సినిమా. పెద్ద సంస్థ, అల్లు అరవింద్, బన్నీ ఇలాంటి వ్యవహారాలు అన్నీ వుండడంతో సితార సంస్థ తలవొంచి వెనక్క వెళ్లిపోయింది.
దసరా టైమ్ లో వరుడు కావలెను వచ్చి వుంటే మరో రెండు కోట్లు చేసి వుండేది. అది వాస్తవం. ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యవహారమే స్టార్ట్ అయింది. అల్లు అరవింద్ తనయుడు బాబి నిర్మిస్తున్న గని సినిమా డేట్ మార్చాల్సి వచ్చింది. బాలయ్య అఖండ సినిమా వచ్చి పడడంతో, గని సినిమాను తీసుకెళ్లి డిసెంబర్ 24కు మార్చారు.
ఏనాడో ఆ డేట్ ను ఫిక్స్ చేసుకుని వుంది నాని 'శ్యామ్ సింగ రాయ్'. సరే రెండు సినిమాలు పోటీ పడతాయి అని అనుకుంటే, శ్యామ్ సింగ రాయ్ ను వెనక్కు వెళ్లమని, డేట్ మార్చుకోమని అల్లు అరవింద్ నుంచి వత్తిడి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి మూడో వారానికి మార్చుకోమని శ్యామ్ సింగ రాయ్ నిర్మాతల మీద గీతా సంస్థ నుంచి వత్తిడి ప్రారంభమైనట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
క్రిస్మస్, న్యూ ఇయర్ అన్నీ చూసుకుని డేట్ వేసుకుంటే, ఇలా మీద పడి డేట్ లాక్కోవడం ఏమిటి అనే కామెంట్ లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. ఏం చేయగలరు ఎవరైనా? థియేటర్లు చేతిలో వున్నాయి ఏమైనా నడుస్తుంది.