పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి సై అనేసింది హీరోయిన్ సమంత. రంగస్థలం సినిమాతో డైరక్టర్ సుకుమార్ మీదే ఏర్పడిన గౌరవం, గతంలో బన్నీతో చేసిన సినిమాలు, పైగా మైత్రీ మూవీస్ బ్యానర్ అన్నీ కలిసి సమంతను ఓకె అనేలా చేసాయి. అయితే అంతే కాదు, ఇస్తున్న రెమ్యూనిరేషన్ కూడా మామూలుగా లేదు.
స్పెషల్ సాంగ్ కు హీరోయిన్ కు కోటి రూపాయలు ఇచ్చిన దాఖలాలు గతంలో వున్నాయి. కానీ ఈసారి కోటి కాదు. దగ్గర దగ్గర రెండు కోట్లు సమంత పాట కోసం ఖర్చు చేస్తున్నారు. ఇది కేవలం రెమ్యూనిరేషన్ గా.
సమంతకు అన్నీ కలిపి కోటి డెభై అయిదు లక్షల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంక ఇవి కాక, అదనపు ఖర్చులు, జీఎస్టీలు వగైరా ఎలాగూ వుంటాయి. అన్నీ కలిపి రెండు కోట్లకు చేరిపోతుంది.
కేవలం నాలుగు రోజుల వర్క్. సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఉదాహరణ.